మన దేశంలో సౌత్ టు నార్త్ అన్న తేడా లేకుండా వ్యభిచారం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ పోతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వ్యభిచారం ఎప్పటి కప్పుడు రూటు మార్చుకుంటోంది. ఇక నార్త్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి సౌత్‌లో భారీగా వ్యభిచారం చేయిస్తున్నారు. నార్త్ లో అయితే విదేశీ మోడల్స్‌ను రప్పించి వ్యభిచార రాకెట్లు ఎక్కువుగా నడుపుతున్నారు. థాయ్ లాండ్, బంగ్లాదేశ్, ఉబ్జెకిస్తాన్ అమ్మాయిలకు మంచి గిరాకీ ఉంటోందట.
ఈ క్రమంలోనే ముంబైలో విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తోన్న ఓ వ్యక్తిని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న నదీమ్‌ఖాన్(26) అనే వ్యక్తి అధిక సంపాదన కోసం సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చాలా సీక్రెట్‌గా పెద్ద ఎత్తున నడుపుతోన్న ఈ దందాపై పోలీసులకు ఎక్కువ ఫిర్యాదులు రావడంతో పోలీసులు పక్కా ప్లాన్‌తో ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు.
పోలీసుల ప్లాన్ ప్రకారం ఓ పోలీసు నదీమ్‌ఖాన్‌ను ఫోన్ చేసి అమ్మాయి కావాలని కోరడంతో అతడు సరేనన్నాడు. తన వద్ద ఉబ్జెకిస్థాన్ మోడల్స్ ఉన్నారని, వారితో ఎంజాయ్ చేయడానికి ఒక్క రాత్రికి రూ.60 వేలు చెల్లించాలని చెప్పాడు. ఆ సీక్రెట్ పోలీస్ ఓకే చెప్పడంతో అడ్వాన్స్ తీసుకుని ఓ అపార్ట్మెంట్లో రూమ్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన సీక్రెట్ పోలీస్‌కు నదీమ్ ఖాన్ ఇద్దరు ఉబ్జెకిస్థాన్ అమ్మాయిలను చూపించాడు.
లోపలకు వెళ్లిన సీక్రెట్ పోలీస్ ఈ సమాచారం బయటకు ఇవ్వడంతో క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ టీమ్ హోటల్‌పై రైడ్ చేసింది. ఇద్దరు విదేశీ మహిళలతో పాటు సెక్స్ రాకెట్ నిర్వాహకులు నదీమ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ మహిళలను టూరిస్ట్ వీసాపై ముంబయికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడని పోలీసుల తెలిపారు.