దేశం మొత్తం దిశ కేసు పై అట్టుడికి పోతుంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు దిశపై అఘాయిత్యానికి పాల్పపడి హత్య చేసిన నర హంతకులకు ఉరిశిక్ష విధించాలని పెద్ద ఎత్తు డిమాండ్ చేస్తున్నారు.  పార్లమెంట్ లో సైతం దిశ కు న్యాయం జరగాలని.. కామాంధులకు కఠిన శిక్ష విధించాలని.. మరికొంత మంది ఉరి తీయాలని డిమాండ్ చేశారు.  ఇంత జరుగుతున్నా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.  మహిళలపై అత్యాచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. అన్యాయంగా చనిపోయిన దిశ కు సంబంధించిన వీడియోని ఫోర్న్ సైట్లలో వెతుకుతున్నట్లు సమాచారం మరింత కుంగిపోయే విధంగా చేస్తుంది..సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంది. 

 

ఇక నిజామాబాద్ కి చెందిన ఓ దుర్మార్గుడు దిశ గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ లు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.  ఇదిలా ఉంటే మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహిళ కారును ఢీకొట్టిన ముగ్గురు మైనర్లు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడమే కాదు దాడి కూడా చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహిళ సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కారులో వెళ్తున్నారు. ఆమెను ముగ్గురు ఆకతాయిలు వెంబడించారు.

 

ఆమె కారు ఢీకొట్టారు..ఆమె కారు ఆపడంతో కారులో నుంచి బయటకు లాగి ఆమెపై  పట్ల వికృత చేష్టలకు పాల్పపడ్డారు.   ఆమెను బండ బూతులు తిడుతూ..   వెనుక నుంచి కొడుతూ లో దుస్తులు చించేశారని చెబుతున్నారు. దారుణంగా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా యాక్సిడెంట్ కేసుగా భావించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అయితే జరిగిన విషయం సీఐ తెలుసుకొని ఆమె ఆదేశాలతోనే బంజారాహిల్స్ పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితురాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: