దేశంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఆడపిల్లలకు ప్రతిచోట భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది . భయం గుప్పిట్లో ఆడపిల్లలు జీవనం సాగిస్తున్నారు. అసలు ఆడపిల్లల జీవితానికి రక్షణ ఉందా అన్నది కూడా ప్రశ్నార్థకం గా మారిపోయింది. బయటకు వెళితే ఆకతాయిల నుంచి... చదువుకోడానికి వెళ్తే  గురువుల నుంచి... ఇంట్లో ఉంటే సొంత వాళ్ల నుంచి... ప్రతి చోట కామంతో కళ్లు మూసుకుపోయిన మగాళ్లు కనీసం మానవత్వాన్ని మరిచి మహిళల జీవితాలతో ఆడుకుంటూ అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు గాంధీ గారు మహిళ అర్ధరాత్రి రోడ్డు పైన తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం మహిళ అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా రోడ్డుపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. 

 

 

 

 కొంతమంది వావివరుసలు మరచి మరి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అన్న చెల్లి పిన్ని అమ్మ నాన్న ఎంతో విలువైన బంధాలను కూడా తమ కామపు  కళ్ళతో మర్చిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు . నాన్నంటే కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకునే పెద్ద చేసి ఓ అయ్య చేతిలో పెట్టాలి. నాన్నంటే కూతురికి ఏ కష్టం రాకుండా అన్నీ తానై  ముందుండి నడిపించాలి. నాన్న అంటే కనీసం కూతురికి చిన్న కష్టం కొడుకు తెలవకుండా పెంచాలి.కానీ  ఇక్కడున్న నాన్న  మాత్రం తన కూతురు పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరుసలు మరచి కనీసం మానవత్వం కూడా లేకుండా కన్న కూతురునే కామపు కళ్ళతో చూసి అత్యాచారం చేశాడు ఇక్కడ ఓ కసాయి తండ్రి. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... కన్నతండ్రి పదిహేడేళ్ల కూతురిపై అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ జలోర్  ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు వీరిద్దరికీ ఓ కూతురు ఉన్నది.  అయితే భర్త వేధింపులు తట్టుకోలేక ఆ భార్య ఎప్పుడో  అతని వదిలేసి వెళ్ళింది. అయితే కూతురు మాత్రం తండ్రితోనే ఉంటుంది. అయితే ఓ రోజు తండ్రి మరో మహిళతో ఉండడం చూసింది కూతురు.దీంతో  కూతురిని గొలుసులతో మంచానికి కట్టేసి... తన తండ్రి అత్యాచారం చేశాడని ఆ బాధిత యువతి తెలిపింది. తర్వాత తన కసాయి తండ్రి నుంచి తప్పించుకొని గొలుసులతోనే వెళ్లి మేనమామ వద్దకు చేరిన ఆ యువతి జరిగిన విషయాన్ని మేనమామకు చెప్పడంతో మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన కన్న తండ్రి తనపై అత్యాచారం చేశాడని ఆ యువతీ  ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: