గతంతో పోలిస్తే పలు బ్యాంకులను నమ్మి ఇటీవల ప్రజలు విరివిగా డిపాజిట్లు చేయడం ఒకింత ఎక్కువ అయిందనే చెప్పాలి. ఎందుకంటే బయట ఇంకెక్కడైనా వాటిని భద్రపరచడం కంటే బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే, తమ సొమ్ముకు భద్రత కలగడంతో పాటు కొంత వరకు వడ్డీ కూడా లభిస్తుందని ఎక్కువమంది ఈ విధంగా యోచన చేస్తున్నారు. అయితే ఇకపై మీ డిపాజిట్లకు పెద్దగా భద్రత ఉండదు అనేలా నేడు ఆర్బీఐ అనుబంధ సంస్థైన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజిసి) వారు, సహ చట్టం ద్వారా దాఖలైన ఒక పిటీషన్ కు ఇచ్చిన సమాధానం వింటే మనకు అర్ధం అవుతుంది. 

 

వాస్తవానికి ఏవైనా బ్యాంకులు నష్టాల్లో ఉన్నపుడు లేదా ఫెయిల్ అయినపుడు తమ బ్యాంకులో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు చెల్లించే ఇన్సూరెన్సు మొత్తం కేవలం రూ.1 లక్ష వరకు మాత్రమే డీఐసీజీసీ స్పష్టం చేస్తోంది. 1961, సెక్షన్ 16(1) రూల్స్ ప్రకారం మాత్రమే తాము వ్యవహరిస్తున్నామని ఒక జాతీయ మీడియా సంస్థ యొక్క వ్యాజ్యానికి వారు సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్సు కవరేజిని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో చాలావరకు నిజం లేదనేది ప్రస్తుతం డీఐసీజీసీ వారు తాజాగా ఇచ్చిన ఈ సమాధానాన్ని బట్టి చాలావరకు స్పష్టం అవుతోందని అంటున్నారు మార్కెట్ నిపుణులు. 

 

నిజానికి డిపాజిట్ దారుల సొమ్ము భద్రత కోసం ఇన్సూరెన్సు సొమ్ముని కేంద్ర ప్రభుత్వం పెంచే యోచన చేస్తోందా అనే విషయమై తాము సహ చట్టం ద్వారా వేసిన వ్యాజ్యానికి వచ్చిన జవాబుని బట్టి చూస్తుంటే ఇన్సూరెన్సు క్లెయిమ్ ని పెంచేయోచన కేంద్ర ప్రభుత్వానికి లేదనేది ఈ సమాధానం ద్వారా తేటతెల్లమైందని ఆ జాతీయ సంస్థ వారు చెప్తున్నారు. సేవింగ్స్, కరెంటు, ఫిక్స్డ్, రికరింగ్ వంటి డిపాజిట్లన్నిటికీ కూడా రూ.1 లక్ష వరకే భీమా కవరేజ్ వర్తిస్తుందని డీఐసీజీసీ వారు క్లుప్తంగా తెల్పడం జరిగింది. మరి ఈ సమాధానం యొక్క ప్రభావం రాబోయే రోజుల్లో డిపాజిట్ దారుల్లో ఎటువంటి మార్పులు తీసువస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: