ఒకప్పుడు మోసం అబ్బాయిలు మాత్రమే చేసేవారు ఇప్పుడు మహిళలు కూడా బానే చేస్తున్నారు. బనే కాదు ఎక్కువగా చేస్తున్నారు. చిట్టీలు అని, లంచాలు అని ఇలా ఎలా అంటే ఆలా మహిళలు మహిళలనే మోసం చేస్తున్నారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలలోని బొమ్మలసత్రానికి చెందిన గురు మహాలక్ష్మి అనే మహిళ స్థానికంగా వస్త్ర దుకాణం నిర్వహిస్తుండేది. 

             

అయితే ఆ సమయంలోనే ఆ ప్రాంతంలోని ప్రజలతో పరిచయాలు పెంచుకుంది. తాను కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న అని, కలెక్టర్‌తో పాటు కార్యాలయంలోని సిబ్బంది బాగా పరిచయం ఉందని అందరిని నమ్మించింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, సబ్సిడీ రుణాలు, వితంతు, ఒంటరి మహిళ పించన్లు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 60 మంది మహిళల వద్ద డబ్బు వసూలు చేసి పారిపోయింది మహాలక్ష్మి. 

               

దీంతో బాధితులు నంద్యాలలోని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ ఏడాది మే నెలలో ఒక్కొక్క మహిళ నుంచి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసింది. ఉద్యోగాలు, పింఛన్లు, రుణాలు రాలేదని బాధితులు ఆ మహిళను నిలదీశారు. అయితే త్వరలోనే అందరికి అన్ని వచ్చేస్తాయంటూ మాయ మాటలు చెప్పి బాధితుల నుంచి వసూలు చేసుకున్న రూ.46 లక్షలతో ఈ మాయలేడి పరారైయింది. 

                    

బాధితులు లక్ష్మికి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో మోసపోయామని నిర్ధారించుకొని సోమవారం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. విషయాన్ని సీఐకి వివరించి ఫిర్యాదు చెయ్యగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కిలాడీ లేడి పోలీసులకు ఎప్పుడు చిక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: