ఏపీ సచివాలయం నుండి గౌతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమెజాన్ తో ఆప్కో ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఏపీ చేనేత వస్త్రాలకు ఇకనుండి అమెజాన్ మార్కెటింగ్ చేయనుంది. ఆప్కో నుండి 104 రకాల చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ జరగనుంది. చేనేతలకు సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆన్ లైన్ లో ఆప్కో వస్త్రాల కొనుగోలును మంత్రి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. 
 
సీఎం జగన్ ఆదేశాలతో అమెజాన్ తో ఒప్పందం చేసుకున్నట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇకపై అమెజాన్ లో ఆప్కో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు. ఏపీ ప్రభుత్వం చేనేత వస్త్రాలకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. సీఎం జగన్ చేనేత ఉత్పత్తులకు ప్రధాన సమస్యగా ఉన్న మార్కెటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కొత్త పంథాను అవలంబించారు. 
 
వెంకటగిరి చీరలు, ఉప్పాడ, ధర్మవరం చీరలు, యువతులు మెచ్చే చేనేత డ్రస్ మెటీరియల్స్, చొక్కాలు, ధోవతులు ఇకపై ఆన్ లైన్ ద్వారా షాపింగ్ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఫ్లిప్ కార్ట్ తో కూడా చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ నెల చివరి వారం నుండి అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. 
 
ప్రభుత్వం 500 రూపాయల నుండి 20,000 రూపాయల లోపు ధర ఉన్నవాటిని అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం బయట మార్కెట్ లో కంటే తక్కువ ధరకే ఆన్ లైన్ లో విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ గుర్తింపు లోగోను వినియోగదారులు మోసపోకుండా చేనేత వస్త్రాలపై ముద్రించనుంది. రకానికి వెయ్యి చొప్పున ప్రభుత్వం ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉత్పత్తుల ఫోటోలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: