రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ నిధులతో నూతనంగా 4,892 గ్రామ సచివాలయాల  నిర్మాణం చేస్తాము అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియచేయడం జరిగింది. తాజాగా పెద్దిరెడ్డి సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై  సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో భాగంగా  మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో ఇప్పటివరకు సుమారు 2,781 గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. 

 

Peddireddy Ramachandra <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=REDDY' target='_blank' title='reddy- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>reddy</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=REVIEW' target='_blank' title='review-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>review</a> Meeting On NREGA - Sakshi

 

ఇక రాష్ట్రంలో గ్రామసచివాలయాల డిజైన్లను పరిశీలించి.. తక్కువ ధరకే సిమెంట్‌ను అందించేలా సిమెంట్ కంపెనీలతో కలెక్టర్లు చర్చలు నిర్వహించాలని  మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరడం జరిగింది. ఇక  సిమెంట్ బస్తా ధర రూ. 240కి వచ్చేలా చూసుకోవాలని సూచించడం జరిగింది. పంచాయతీరాజ్ ఈఎన్‌సీల ద్వారా పీఈఆర్‌టీ చార్ట్‌లను సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. ఇప్పటి వరుకు  చేపట్టిన పనుల పురోగతిపై నివేదికను అధికారులు బాధ్యుతంగా సిద్దంగా ఉంచండి అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పక్కాగృహాల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల  నిర్మాణం కోసం స్థలాల లెవలింగ్, గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని వివరించడం జరిగింది.

.
ఇక గ్రామాల్లో అవసరమైన చోట్ల సీసీ డ్రైనేజీల నిర్మాణం చేపట్టేలా చేయాలని తెలిపారు. ఈ నిర్మాణాలకు 30శాతం స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పోరేషన్, మిగిలిన 70 శాతం ఉపాధి నిధులను కేటాయిస్తాను అని మంత్రి తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,418 పనులకు అంచనాలు సిద్ధం చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియచేయడం జరిగింది.  ఇక  అంతర్గత రహదారులు లేని గ్రామాల్లో 90 శాతం ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు నిర్మించాలని తెలిపారు మంత్రి. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కలిపి ఇస్తాము అని  మంత్రి పేర్కొన్నారు. ఉపాధి హామీ నిధులతో ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.601 కోట్లు కేటాయించడం జరిగింది అని మంత్రి తెలియజేయడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: