ప్రభుత్వ టీచర్లు వారి బదిలీల సమయంలో తాము బోధించిన పాఠశాలను వదిలి వెళ్తుంటే ఆ పాఠశాల విద్యార్థులు బోరుమని ఏడ్చిన సంఘటనలను మనం ప్రత్యక్షంగానో... పరోక్షంగానే చూసాం. ఇంతవరకు చూసిన వాటిలో వెళ్లొద్దు సార్ అంటూ విద్యార్థి విద్యార్థినులు కంటతడి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం... ఒక స్కూలు ప్రధానోపాధ్యాయురాలు బదిలీ అవ్వనప్పటికీ.. ఆ పాఠశాల విద్యార్థినులు ఆమెను స్కూల్ నుంచి బయటికి తోసేస్తున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా శ్రీదేవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే ఒక విద్యార్థినిని అయిదుగురు ఆకతాయిలు గత కొంతకాలంగా వేధిస్తున్నారు. పాఠశాలకు వెళ్ళేటప్పుడు.. మళ్లి ఇంటికి తిరిగివచ్చేపుడు..ఇంకా పాఠశాలలో ఉన్నపుడు కూడా ఆ యువకులు ఆ బాలికను వేధిస్తున్నారు. దాంతో వారి వేధింపులను తాళలేక.. ఆ విద్యార్థిని పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ అయిన శ్రీదేవికి ఆకతాయిల గురించి చెప్పింది. కానీ శ్రీదేవి పోలీసులకు ఆకతాయిల మీద ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

విద్యార్థిని ఫిర్యాదు చేసినా పోలీసులకి తెలియజేయలేదన్న ఆగ్రహంతో....ఈ హెచ్‌ఎం మాకు వద్దంటూ .... ఆ ఊరిలోని కొంత మంది మహిళ గ్రామస్తులు.. ఇంకా విద్యార్థినులు అందరూ కలిసి.. ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవిని బయటకు తోసుకుంటూ ఆందోళనకు దిగారు. ఇక పోతే.. ఆదివారం రోజు.. ఆ అయిదుగురు ఆకతాయి లోని ఒక ఆకతాయిని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇక మిగిలిన ఆకతాయిలతో సహా ఈ దేహశుద్ధి చేయించుకున్న అతన్ని కూడా సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో చదువుకొని మగవాళ్ళు అంతా అమ్మాయిలను వేధించే పనిలోనే ఉన్నారంటూ అక్కడి గ్రామస్థులు మండిపడుతున్నారు. హెడ్ మాస్టర్ అయ్యుండి విద్యార్థుల మంచి చెడ్డలు చూసుకోకపోవడంతో ఆమెకు కూడా చివాట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: