ఒక వైపు నిర్భయ కేసు కొలిక్కి రాలేదు. మరో వైపు దిశా కేసు విచారణలో ఉంది. కాని ఇలాంటిదే మరో కేసు విషయంలో ఆ మగతోడేలుకు కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. కన్ను మిన్ను కానక కూతురు వరుస అయ్యె మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన ఘటనలో కోర్ట్ తగిన శిక్షే వేసింది. వివరాలు తెలుసుకుంటే ఇబ్రహీంపట్నం లో నివాసముంటున్న సైకం కృష్ణారావు అనే వ్యక్తి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు.

 

 

అతనితో పాటుగా అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు బిడ్డల తల్లిపై మనసు పడ్డాడు. ఈ క్రమంలో తనకు భార్యలేదని.. ఒప్పుకుంటే పెళ్లిచేసుకొంటానని ఆమెకు ప్రపోజ్‌ చేయడమే కాకుండా తన పిల్లలని కన్నబిడ్డల్లా చూసుకుంటానని బాస చేశాడు. అప్పటికే తన భర్తతో తెగతెంపులు చేసుకొని పిల్లలతో ఇబ్బంది పడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆ వివాహిత కృష్ణారావు ప్రతిపాదనకు ఒప్పుకుంది. ఈ క్రమంలో పదకొండేళ్ళుగా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఇక అప్పటికే మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా వారితో పాటుగానే ఉండేవారు. వారిలో పదో తరగతి చదువుతున్న కూతురిపైనే కన్నేశాడు ఈ మారు తండ్రి కృష్ణారావు.

 

 

అతని భార్య బైటికెళ్లిన సమయంలో వరసకు కూతురన్న కనికరం కూడా లేకుండా మాటేసి కాటేశాడు. పశువులా మారి కామవాంఛ తీర్చుకొన్నాడు. వావివరసలు మరిచి శునకానందం పొందాడు. ఇంటికొచ్చిన తల్లికి జరిగిన ఘోరం చెప్పగా., భరించరాని కోపంతో ఆ నీచునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పింది.

 

 

ఇక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేయడంతో ఏడాది తిరక్కముందే కేసు విచారణకు రాగా. విజయవాడలోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కృష్ణారావును దోషిగా తేల్చి అతనికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువందల జరిమానా విధించారు.

 

 

ఒకమైపు దేశవ్యాప్తంగా దిశా హత్యాచార కేసుపై పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు విషయంలో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పట్ల కొంతవరకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా మిగతా ఘటనల విషయంలో కూడా ఆలస్యం వహించకుండా నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటే సమాజంలో ఉన్న చీడ కొంతవరకైనా తగ్గుతుందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: