మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మందు బాబులకు షాకిస్తూ మద్యం ధరలను భారీగా పెంచింది. అదనపు రిటైల్ టాక్స్ పేరుతో ఈ ధరలను పెంచారు. ఒక్కో బాటిల్ పై కనీసం 10 నుంచి గరిష్టంగా 250 వరకూ టాక్స్ విధించారు. అక్టోబర్ ఒకటి నుండి ఈ నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది వీటితో పాటూ పెరిగిన ధరలు కూడా అమల్లోకి వచ్చాయి. ఇకపోతే మద్య నిషేధ కార్యక్రమం అమలులో భాగంగా మద్యం బాటిళ్లపై అడిషనల్ రిటైల్ ఎక్సైజు టాక్స్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీప్రభుత్వం.

 

 

దేశీయంగా తయారైన విదేశీ మద్యం, బీర్, వైన్ ఇతర వెరైటీ మద్యంపై ఈ ఏఆర్ఈటీ పన్ను విధించారు. 90 మిల్లీ లీటర్ల బాటిల్‌కు గరిష్టంగా 10 రూపాయల పన్ను విధించగా, వాటి పరిమాణం పెరిగే కొద్దీ పన్ను రెట్టింపు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను 20శాతం వరకు తగ్గించింది ప్రభుత్వం. దీంతో పాటుగా వైన్ షాపుల్లో మద్యం అమ్మే సమయాల్లో కూడా మార్పులు చేసింది. ఇకపోతే ఇప్పుడు జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కొత్త చిక్కు వచ్చి పడింది. బార్లకు అంత ధరలు నిర్ణయించడం పై హైకోర్ట్ కన్నెర్ర చేస్తుంది.

 

 

ఏపీలో పెరిగిన నూతన మద్యం పాలసీ విధానంపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వాన్ని బార్లకు అంతేసి ధరలను ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. ఈ విషయం పై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నెల తొమ్మిదోవ తారీఖులోపల వివరణ ఇవాలని ఆదేశించింది. ఇదే కాకుండా ఈ విషయంలో ఇదే నెల పదహారోవ తారీఖు వరకు కౌంటర్ దాఖాలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది.

 

 

ఇకపోతే ఏపీలో పెరిగిన ధరలతో ఇప్పటికే మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఏపీలో 4,380 మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలోేనే నడుస్తుండగా. పట్టణాలు, నగరాల్లోని మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్ నియమించారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్ పనిచేస్తారు. గ్రామాల్లో మద్యం మహమ్మారిని తరిమేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,944 మహిళా కానిస్టేబుళ్లను నియమించింది ఏపీ ప్రభుత్వం. 

మరింత సమాచారం తెలుసుకోండి: