2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘనవిజయం సాధించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు విడిపోవడంతో ఆ రాష్ట్రానికి బాబు అవసరం ఉన్నది.  దీంతో బాబును ప్రజలు ఎన్నుకున్నారు.  బాబు తెలివైన వ్యక్తి.. అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు.. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీని తీసుకొచ్చిన వ్యక్తి.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన వ్యక్తిగా బాబుకు పేరు ఉన్నది.  


అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు చూస్తుంటే బాబోయ్ అనిపిస్తోంది. పదేళ్ళపాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటె.. దాన్ని కాదని చెప్పి బాబు తన మెహర్బానీ కోసం, చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి రాజధానిని అమరావతికి షిఫ్ట్ చేశారు.  విజయవాడలో వివిధ ప్రాంతాల్లోని బిల్డింగ్స్ ను తీసుకొని అక్కడి నుంచే పాలన చేసుకుంటూ వచ్చారు.  


ఇకపోతే, అమరావతిని ఏర్పాటు చేసి 2018 నాటి మొదటిదశ నిర్మాణాలను పూర్తి చేస్తామని చూపిన బాబు, ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి నిర్మాణాలను నిర్మించారో తెలియలేదు.  తాత్కాలిక నిర్మాణాలు నిర్మించి మమ అనిపించారు.  రాజధాని కోసం ఏకంగా 33వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు.  ఇలా రైతుల నుంచి సేకరించిన భూమిని రాజధాని కోసం ఎంతవరకు ఉపయోగించారో తెలియదు.  దీనిని పక్కన పెడితే.. బాబుగారు 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.  

 

ఓడిపోయిన తరువాత కూడా బాబు తన తీరు మార్చుకోవడం లేదని, ప్రతి విషయంలో బాబు ప్రభుత్వంలో తల దూరుస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నది.  వైకాపా ప్రజల కోసమే పనిచేస్తుందని ఆమె అన్నారు. ప్రజల కోసమే ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి అమలు జరిగేలా చూస్తున్నారని, తమది పేదల ప్రభుత్వం అని బాబులా మెహర్భానీలు పోవడం తమకు తెలియదని ఆమె అన్నారు.  ఎన్నికల్లో బాబుకు ప్రజలు బుద్దిచెప్పినా ఇంకా అయన తీరు మార్చుకోలేదని ఆమె పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: