జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికి అర్ధం కాదు. సమయం సందర్భం లేకుండా అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడేస్తుంటారు. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ విధంగానే ఎక్కువ మాట్లాడుతూ...ఇంకా జనాల్లో సరైన నాయకుడుగా ఎదగకుండా అలాగే ఉండిపోయారు. ఎన్నికల్లో ఓటమి దెబ్బకు అయిన మనిషి మారతాడు అనుకుంటే అది లేదు. ఓడిపోయిన దగ్గర నుంచి వరుసగా జగన్ ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల గురించి ఓ డైలాగ్ వేశారు.

 

ఇక ఆ డైలాగ్ విన్నవారు అయితే లోపల పడి పడి నవ్వుకుని ఉంటారు. ఇంతకు ఆయన ఏ మాట్లాడారంటే....జగన్ కు పాలన చేతకాకపోతే దిగిపోయి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. అయితే ఆయన మాట్లాడిన సందర్భం ఏమో.... ఉల్లిపాయ ధరలు గురించి. తాజాగా తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన ఉల్లి ధరలు రూ.20 ఉండాల్సినవి....రూ. 100కు పెరగడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

ఈ సందర్భంలోనే జగన్ ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోయి ఎన్నికలు పెట్టాలని మాట్లాడారు. అసలు ఉల్లి ధరలు గురించి జగన్ దిగిపొమ్మనడం ఏంటో ఎవరికి అర్ధం కాలేదు. దేశమంతా ఉల్లి కొరత ఉంది. మన రాష్ట్రంలోనే ప్రత్యేకంగా లేదు. అక్కడకి జగన్ ప్రభుత్వం రైతు బజార్లు ద్వారా ఉల్లి తక్కువ ధరకు అందజేస్తున్నారు. పవన్ ఈ విషయాల ఏమి పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు జగన్ ని దిగిపొమ్మని అన్నారు. పోనీ దిగిపోయి ఎన్నికలు నిర్వహిస్తే పవన్ కల్యాణ్ కు గెలిచే సత్తా ఉందా. అంటే అది లేదు.

 

మొన్న జనసేనకు ఒక్క సీటు అన్న వచ్చింది...ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ఆ సీటు కూడా రాదు. అసలు ఆరు నెలల్లో జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. పైగా జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబు లైన్ లోనే పవన్ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇద్దరు కలిసే జగన్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రజల్లో సింపతీ కూడా ఉంది. మరి ఇలాంటి సమయంలో జగన్ ని దిగిపొమ్మని చెప్పి ఎన్నికలు పెట్టించి పవన్ ఏం పొడుద్దామని అనుకుంటున్నారో ఏంటో ?  ప‌వ‌న్ జోకులు ఎప్ప‌ట‌కి ఆపుతాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: