కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా  కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క కుటుంబాన్ని టార్గెట్‌ చేయలేదని తెలిపారు. అమిత్‌ షా  ఎస్పీజీ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు  సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీజీ అనేది స్టేటస్‌ సింబల్‌ కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బాధ్యత ప్రజలకు భద్రత కల్పించడం  అని తెలిపారు. అమిత్‌ షా ఇది ఐదవసారి ఎస్పీజీ చట్టానికి సవరణ చేయడం  అని  గుర్తుచేశారు.

 

అయితే  సవరణ  గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఏది చేయలేదని స్పష్టం చేశారు. కానీ గతంలో జరిగిన నాలుగు సవరణలు కూడా గాంధీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే జరిగాయని విమర్శించారు. ఎస్పీజీ భద్రతను కేవలం గాంధీ కుటుంబానికే కాకుండా.. మాజీ ప్రధానులకు కూడా తొలగించిన విషయాన్ని గమనించాలన్నారు. 

 

 దేశంలోని ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.కేవలం గాంధీ కుటుంబాన్ని మాత్రమే కాదు. ఎస్పీజీ కాంగ్రెస్‌ నేతలు గాంధీ కుటుంబానికి  కావాలని ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. భద్రతను ముప్పు ఆధారంగానే  తొలగించినట్టు స్పష్టం చేశారు.  ప్రధాన మంత్రికి మాత్రమే ఎస్పీజీ భద్రత  ఉంటుందని వెల్లడించారు. అమిత్‌ షా ప్రసంగం అనంతరం.. రాజ్యసభ  ఎస్పీజీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే దీనిపై కాంగ్రెస్‌ నిరసిస్తూ  సభ నుంచి వాకౌట్‌ చేసింది. కాగా ఎస్పీజీ సవరణ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్‌  ఈ బిల్లుకు  ఆమోదం లభించింది. 

 

అమిత్‌ షా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇంటి వద్ద భద్రత లోపంపై స్పందించారు. ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్సెండ్‌ చేసినట్టు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: