జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చూసిన తర్వాత జనాలకు ఇలాగే అనిపిస్తోంది. ఏ విషయంలోను స్పష్టమైన అభిప్రాయం లేకపోవటం, విషయం పరిజ్ఞానం లేకపోవటంతో పాటు నోటికేదొస్తే అది మాట్లాడేయటం పవన్ మానసిక పరిస్ధితికి అద్దం పడుతోంది. సినిమాల్లో ఉన్నంత వరకు మామూలు జనాలకు పవన్ తో ఎటువంటి సంబంధాలే లేవు. కానీ ఎప్పుడైతే రాజకీయ నేత అవతారం ఎత్తాడో అప్పటి నుండి మామూలు జనాలపైన కూడా పవన్ ప్రభావం మొదలైంది.

 

ఇప్పటికే ప్యాకేజి స్టార్ గా ముద్ర వేయించుకున్ పవన్ తనమీద పడిన ముద్ర నిజమే అనేట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబునాయుడు వ్యతిరేకిస్తున్నారంటే అర్ధముంది. ఘనమైన ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్నా జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న ఉక్రోషం చంద్రబాబులో కనిపిస్తోంది.  కాబట్టి చంద్రబాబు విషయంలో ఏదోలే అని జనాలు సరిపెట్టేసుకోవచ్చు. కానీ పవన్ కు అసలు ఏముందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా జనాలు సరిపెట్టుకోవాలి ?

 

క్రిస్తియన్ అయిన జగన్ మద్దతుతోనే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందనే అర్ధమొచ్చేట్లు మాట్లాడారు. కానీ తిరుమలలో జరుగుతున్న అన్యమత ప్రచారానికి హిందువులే కారణమన్నారు తాజగా చెప్పారు. రెండింటిలో ఏది నిజమో జనాలకు అర్ధం కాక పిచ్చెక్కిపోతున్నారు. 2017లో జరిగిన ఓ హత్యాచారం కేసును జగన్ ఎందుకు తొక్కి పెడుతున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ మాటలు విన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే 2017లో అధికారంలో ఉన్నది చంద్రబాబు అయితే జగన్ ను ప్రశ్నించటమేంటో ఎవరికీ అర్ధం కాలేదు.

 

ఇక ఈమధ్యనే తెలంగాణాలో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం గురించి మాట్లాడుతు సమాజంలో మహిళలకు రక్షణ కల్సించలేనపుడు 151 సీట్లు ఇచ్చి ఉపయోగం ఏమిటి ? అంటూ జగన్ పై మండిపడ్డారు. ఘటన జరిగింది తెలంగాణాలో అయితే జగన్ ను ఎందుకు ప్రశ్నిస్తున్నారో ఎవరికీ అర్ధంకాలేదు. మొత్తం మీద పనవ్ వైఖరి చూసిన తర్వాత అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టమనే అభిప్రాయం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: