చంద్రబాబు-పవన్ కల్యాణ్ లు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు. అవ్వడానికి వేరు వేరు పార్టీలు అయిన వీరు లైన్ మాత్రం ఒక్కటే. అది జగన్ ని విమర్శించడం. గత ఐదేళ్లు అధికారంలో పార్టనర్లుగా ఉన్న బాబు-పవన్ లు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇద్దరు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో కడుపు మంటతో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ కు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా వెంటనే విమర్శలు చేస్తూ వచ్చారు.

 

గత ఆరు నెలలుగా బాబు ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారో...పవన్ కూడా అదే లైన్ లో విమర్శలు చేస్తారు. ఈ ఆరు నెలల్లో సరైన కారణాలు లేకుండానే వీరు పనికిమాలిన విమర్శలు చాలానే చేశారు. అయితే మొదట్లో వీరి విమర్శల గురించి ప్రజలు కొంత ఆలోచించేవారు. కానీ రాను రాను వీరిపై ప్రజల్లో కూడా యావగింపు పెరిగిపోయింది. ఎప్పుడు చూడు రొటీన్ రొట్ట విమర్శలు చేయడం వల్ల ప్రజలకు విసుగొచ్చేసింది.

 

మామూలుగా ప్రతిపక్ష పార్టీలు అంటే నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ..ప్రభుత్వానికి సలహలు ఇవ్వాలి. కానీ వీరు మాత్రం ఏది దొరికితే అది అన్నట్లుగా మాట్లాడేస్తారు. ఇందులో బాబు అయితే ఎప్పుడు చూడు అవే విమర్శలు, అవే మాటలు. కొత్తగా ఏం చెప్పరు. ప్రజలని ఆలోచింపజేసేలా మాట్లాడరు. ఏదో మనం రోజు మీడియాలో కనిపించాలనే కుతూహలంతో గంటలు గంటలు స్పీచులు ఇచ్చేస్తారు. దీని వల్ల ప్రజలకు అసలు విషయం అర్ధం కాక, బాబు స్పీచ్ ల పట్ల బోరు ఫీల్ అవుతున్నారు. సొంత పార్టీ వాళ్లే బాబు స్పీచ్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపారు.

 

ఎప్పుడు ఒకటే డబ్బు కొట్టుడు కొట్టడం వల్ల, ఆయన మాటలని ప్రజలు లైట్ తీసుకునే స్థాయికి వెళ్లిపోయింది. ఇక పవన్  ఏం మాట్లాడతాడో ఎవరికి అర్ధం కాదు. ఏదో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ మాట్లాడతారు. దీనివల్ల అభిమానులు గంతులేస్తారేమో గానీ, ప్రజలు మాత్రం అసహ్యించుకుంటారు. ఇదివరకు పవన్ మాట్లాడితే ప్రజలు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. ప‌వ‌న్ స్పీచ్‌లు రొటీన్ అయిపోయాయి. మొత్తానికి ఈ ఇద్దరు ఇలా రొటీన్ గా మాట్లాడుతూ...ప్రజల్లో చులకనైపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: