పవన్ కళ్యాణ్ చదువును ఇంటర్మీడియట్ వరకే ఆపేసిన సంగతీ తెలిసిందే. ఇదే విషయం మీద చాలా మంది రాజకీయ నాయకులు పవన్ ను విమర్శిస్తుంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన చదువు ఎందుకు ఆగిపోయిందో వివరించాడు.  తాను ఇంట‌ర్ ఫెయిలైన విష‌యాన్ని ప‌వ‌న్ ప‌లుమార్లు ప్ర‌స్తావించాడు. ప్ర‌త్య‌ర్థులు సంద‌ర్భానుసారంగా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించి ప‌వ‌న్‌ను ఎద్దేవా చేస్తుంటారు. అయితే తాను ఇంట‌ర్ ఫెయిల‌వ‌డం గురించి జ‌న‌సేన అధినేత నామోషీగా ఏమీ ఫీల‌వ‌డు.   అయితే ప‌వ‌న్ ఇంట‌ర్ ఫెయిల‌వ‌డానికి అస‌లు కార‌ణం ఏంట‌న్న‌ది ఎప్పుడూ వివ‌రించ‌లేదు. తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన స‌మావేశంలో ప‌వ‌న్ ఈ విష‌యం ప్ర‌స్తావించాడు. తాను ఇంట‌ర్ ఫెయిల‌వ‌డానికి.. అక్క‌డితో త‌న చ‌దువు ఆగిపోవ‌డానికి ఇంగ్లిష్ మీడియ‌మే కార‌ణం అని ప‌వ‌న్ వెల్ల‌డించ‌డం విశేషం.


అయితే పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా .. తన బాల్యం గురించి చదువు గురించి చెప్పడం ఇప్పుడు అందరికీ విడ్డురంగా అనిపిస్తుంది. త‌మ‌ది సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం అని.. త‌న తల్లిదండ్రుల‌కు ఇంగ్లిష్ రాద‌ని.. అలాగే త‌న‌ను చిన్న‌ప్ప‌ట్నుంచి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివించార‌ని చెప్పిన ప‌వ‌న్.. మాతృభాష‌లో చ‌దివినంత కాలం త‌న చ‌దువు బాగానే సాగింద‌న్నాడు. ఐతే ఇంట‌ర్మీడియ‌ట్ కోసం త‌న‌ను నెల్లూరులోని ఓ క‌ళాశాల‌లో చేర్పించార‌ని.. అక్క‌డి ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెప్ప‌డంతో త‌న‌కు అర్థం కాలేద‌ని ప‌వ‌న్ తెలిపాడు. 



దీనితో పవన్ తన చదువు అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా పవన్ మీద సెటైర్లు ఆగుతాయేమోనని చూడాలి. అస‌లే త‌న‌కు మ్యాథ‌మ్యాటిక్స్ అంటే భ‌యం అని.. అలాంటిది ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్ప‌డంతో అస్స‌లు బుర్ర‌కు ఎక్క‌లేదని.. దీని వ‌ల్ల త‌న‌కు చ‌దువంటే భ‌యం, విర‌క్తి పుట్టాయ‌ని.. ఒక వ్య‌తిరేక భావం వ‌ల్ల స‌రిగా చ‌ద‌వ‌లేక ఫెయిల‌య్యాన‌ని.. అంత‌టితో త‌న చ‌దువు ఆగిపోయింద‌ని.. దీన్ని బ‌ట్టి బ‌ల‌వంతంగా విద్యార్థుల‌పై ఇంగ్లిష్ మీడియం రుద్ద‌కూడ‌ద‌న్న‌ది త‌న అభిప్రాయ‌మ‌ని.. మాతృభాష‌లో విద్యాబోధ‌న మంచిద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశాడు

మరింత సమాచారం తెలుసుకోండి: