మీరు నమ్మినా నమ్మకపోయినా 151 ఎంఎల్ఏల అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి భయంతో వణికిపోతున్నది మాత్రం నిజం. మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒకే ఒక ఎంఎల్ఏని గెలిపించుకున్న జనసేన అంటే జగన్ భయపడిపోతున్నాడట. తన ధైర్యం, జ్ఞానాన్ని చూసిన తర్వాత జగన్  భయపడిపోతున్నాడని జనసేన అధినేత  పవన్ కల్యాణ్ చెప్పటాన్ని మీరు ఎలా అర్ధం చేసుకుంటారు ?

 

తిరుపతిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలతో అందరూ ఏం చేయాలో తెలీక బుర్రలు గోక్కుంటున్నారు. అసలు తనను చూసి జగన్ ఎందుకు భయపడుతున్నారు ? అన్న విషయాన్ని మాత్రం పవన్ ఎక్కడా చెప్పటం లేదు. అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్ అసలు పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయిన పవన్ అంటే ఎందుకు భయపడుతున్నారనే విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

తనకు ప్రాణభయం లేదని, ఆస్తులను కాపాడుకోవాల్సిన అగత్యం కూడా లేదని సెలవిచ్చారు. ఆస్తులను కాపాడుకోవటం, ప్రాణభయంతో వైసిపి 151 మంది ఎంఎల్ఏలున్నారంటూ చెప్పటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ప్రాణభయమేంటి ? ఆస్తులను కాపాడుకోవటమేంటో ఎంత ఆలోచించినా అర్ధం కావటం లేదు. సమాజం మీద ప్రేమతోనే తాను చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాడట. తనకు భయమంటే తెలీదని అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చాననే చెప్పటమే విడ్డూరంగా ఉంది. 

 

అసలు పవన్ ప్రసంగాలంటేనే జనాలకు ఓ విధమంగా భయపడిపోతున్నారు. ఏం మాట్లాడుతారో తెలీదు. ఎందుకు ఊగిపోతారో తెలీదు. ఏం అంశాన్ని మొదలుపెట్టి ఏ అంశంలోకి వెళ్ళిపోతారో తెలీదు. మాట్లాడే ఏ రెండు మాటలకు ఎటువంటి పొంతనా ఉండదు. ఓటుహక్కు కూడా లేని  అభిమానులు పవన్ నోటినుండి వచ్చే ప్రతిమాటకు ముందోసారి తర్వాతోసారి చప్పట్లు కొడుతుంటే అదే బ్రహ్మాండమని అనుకుంటున్నారో ఏమో ? ఇటువంటి అభిమానులను చూసుకునే మొన్నటి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటి చేసి బొక్క బోర్లా పడ్డారు. అయినా పవన్ లో మార్పు రాలేదంటే ఇక ముందు కూడా మార్పు రాదేమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: