ఒక యువ పోలీసు అధికారి కృష్ణలంక బందరు కాలువ పక్కనున్న ఒక క్వార్టర్ లో నివాసముంటున్నాడు. అయితే రోజూలాగే నిన్న పొద్దున్న కూడా స్తానం చేద్దామని బాత్రూం లోకి వెళ్ళాడు. అలా బాత్రూం లోకి వెళ్లిన పోలీసు అనుకోకుండా కిటికీ లో నుంచి బయటకు చూసాడు. అప్పుడు అతనికి ఒక గుండె రేట్ ను పెంచే సంఘటన కనిపించింది.. అదేంటంటే.. 55 ఏళ్ల మహిళ పక్కనే ఉన్న కాలువ ప్రవాహంలో వేగంగా కొట్టుకుపోతుంది. ఇది చూడగానే... ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా...లుంగీ తోనే పరుగులు తీసాడు. కాలువ వద్ద ఉన్న మెట్ల ద్వారా తన ప్రాణాలనే పణంగా పెట్టి కావలలోకి దూకాడు ఈ యువ ఆఫీసర్. తన శక్తినంతా ఉపయోగించి.. శరవేగంతో ఈదుతూ ఆ మహిళను గట్టిగ పట్టుకున్నాడు. అయితే అప్పటికే గట్టుకు అవతలి వైపున చాలామంది చూస్తున్నారు. కొట్టుకుపోతున్న ఆమెను చూసి కేకలు వేస్తున్నారు. ఊహించలేని రీతిలో.. దేవుడిలా వచ్చి... ఆ కొట్టుకుపోతున్న మహిళను పట్టుకున్న పోలీసుని చూసి వారు ఈలలు వేశారు.


ఆ తర్వాత అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు యువ పోలీసుకు మహిళను ఒడ్డుకు చేర్చేందుకు సాయం చేసారు. ఆ తర్వాత సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రెసిస్టెన్స్‌)లో నైపుణ్యం తెలిసిన పోలీసు.. ఆమెకు ఫస్టు ఎయిడ్ చేశాడు. ఆపై 70-80 సార్లు ఆమె ఛాతీపై ఒత్తడి చేసి శ్వాస తీసుకునేలా చేశాడు. అలా బ్రతికించిన ఆమెను ఆ నలుగురు యువకులు 108 కు ఫోన్ చేసి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఆ కాపాడిన యువ హీరో పోలీసు మరెవరో కాదు... పైన ఫొటోలో ఉన్న ఏఆర్‌ ఎస్‌ఐ దంగేటి అర్జునరావు. కాపాడబడిన మహిమ పేరు.. లక్ష్మి.

ఇంత సాహసం చేసి ఒక మహిళ ప్రాణాలను కాపాడిన అర్జునరావుపై ప్రశంశల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే..తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అర్జునరావు ధైర్య సాహసాలను కొనియాడారు. అర్జునరావు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. అయితే జగన్...రిజర్వ్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ అయిన అర్జునరావు చేసిన సాహసం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ మెడల్ కు అర్జునరావు పేరును రికమెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.
https://mobile.twitter.com/PhanindraP_TNIE/status/1201834775826157569?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed&ref_url=https%3A%2F%2Fd-40325530794269366952.ampproject.net%2F1911121900560%2Fframe.html

మరింత సమాచారం తెలుసుకోండి: