సాధారణంగా మంత్రి పదవిలో ఉండేవారు నియోజకవర్గంలోని సమస్యలు పట్టించుకోవడం చాలా కష్టం. వారు తమకు ఇచ్చిన శాఖలపై పట్టు తెచ్చుకుని, ఆ శాఖని సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ, రాష్ట్రం మొత్తం ఉపయోగపడేలా పని చేయాలి. దాని వల్ల నియోజకవర్గాల్లో ఉండటం పెద్దగా సాధ్యపడదు. అయితే కొందరు మంత్రులు రాష్ట్రం కోసం ఉపయోగపడే పనులు చేయకపోయిన తాము మంత్రులమని చెప్పి...నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడరు. అందుకే ఎన్నికల్లో వారిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారు.

 

గత టీడీపీ హయాంలో మంత్రి పదవులు వెలగబెట్టిన వారందరి పరిస్తితి అలాగే అయింది. ఏదో ఇద్దరు, ముగ్గురు తప్ప మిగతా వారంతా చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం అలాంటి తప్పులు చేయడం లేదు. తమ నియోజకవర్గాల్లో పని చేస్తూనే....తమ శాఖకు సంబంధించిన పనులని కూడా సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ విధంగా చేయడంలో కృష్ణా జిల్లా మంత్రులు మాత్రం ముందున్నారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని ఇద్దరు తమ నియోజకవర్గాలు బందరు, గుడివాడలో పలు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.

 

ఈ ఆరు నెలల్లో మంత్రి పదవిని సమర్ధవంతంగా ఎలా నడిపిస్తున్నారో...అలాగే నియోజకవర్గాలో సమస్యల పరిష్కారానికి కూడా అంతే విధంగా పని చేస్తున్నారు. మొదట ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ గుడివాడ బస్టాండుకు కొడాలి నాని చెక్ పెట్టారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితం నిర్మాణం జరిగిన ప్రస్తుత బస్టాండ్ శిధిలావస్థ దశకు చేరుకోవడంతో కొత్త బస్టాండ్ కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దీని కోసం రూ. 21.31 కోట్ల మంజూరుకు అనుమతినిచ్చింది. అంటే త్వరలోనే గుడివాడ ప్రజలు ఓ సరికొత్త బస్టాండుని చూడబోతున్నారు.

 

ఇక ఇటు రోల్డ్ గోల్డ్ నగలుకు బందరు ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ఇక్కడి రోల్డ్ గోల్డ్ కు దేశవ్యాప్తంగా పేరుంది. అలాంటి రోల్డ్ గోల్డ్ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందేందుకు మంత్రి పేర్ని నాని గోల్డ్ కవరింగ్ చేసే వారికి విధ్యుత్ ధర యూనిట్ కి రూ 9.20 నుండి రూ 3.75 కి తగ్గించారు. ఈ తగ్గింపు రోల్డ్ గోల్డ్ పరిశ్రమ అభివృద్ధికి మరింత ఊతం కానున్నాయి. ఈ విధంగా ఇద్దరు నానీ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పరంగా దూసుకుపోతున్నారు. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే వారు మంత్రులుగా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధిలో మంచి ముద్ర వేసిన వాళ్లు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: