తనని తాను జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ స్టామినానే తనకూ ఉందని పవన్ ఊహించుకుంటున్నారు. తిరుపతిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వందల రోజులు జైల్లో గడిపిన జగన్ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవ్వగా లేంది తాను ప్రజా సమస్యల కోసం తిరగలేనా ? అంటూ ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ పవన్ పోలికలో ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. జగన్ సిఎం అయ్యే ముందు జైల్లో గడిపాడు అని చెప్పటమే.

 

ఇటువంటి పిచ్చి మాటల వల్ల పవన్ జనాల్లో పలుచనైపోయాడు. ఆ విషయం పవన్ ఇంకా గుర్తించినట్లు లేదు. జగన్ ఏకధాటిగా 3680 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిన జగన్ ముందు పవన్ ఎందుకు పనికొస్తాడు ?  గట్టిగా నాలుగు రోజులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తే  మళ్ళీ నెల రోజులు అడ్రస్సే ఉండడు. అలాంటి పవన్ కూడా తాను జగన్ ఒకటే అనిచెప్పుకోవటమే విడ్డూరం. వర్షం వచ్చినా, ఎంత ఎండలు కాసినా, ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ఏకధాటిగా ఏడాదికి పైగా ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా జగన్ పాదయాత్ర చేసిన విషయం అందరకీ తెలిసిందే.

 

పవన్ విషయం తీసుకుంటే బొత్తిగా ఓపికి లేని తనమే గుర్తుకొస్తుంది.  కార్యకర్తల మధ్యలో గట్టిగా నాలుగు రోజులు పర్యటిస్తే మళ్ళీ నెల రోజులు అడ్రస్సే కనబడరు. ఎన్నికల సమయంలోనే పవన్ ఏకధాటిగా పర్యటించలేదు. పాదయాత్రను పక్కనపెడితే ఎన్నికల ప్రచారంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో జగన్ ఒంటిచేత్తో ప్రచారం చేశారు. విజయమ్మ, షర్మిల కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా కొన్ని నియోజకవర్గాలకే పరిమితయ్యారు. అదే సమయంలో పరిశుద్ధాత్మడిగా తనని తాను అభివర్ణించుకుంటున్న పవన్ పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయిన విషయంలో నిజాయితీగా స్వీయ సమీక్ష చేసుకుంటే మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: