షాద్ నగర్ లో జరిగిన దిశా అత్యాచార౦ హత్య వ్యవహారంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహారశైలిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. జాతీయ మీడియాతో పాటు విపక్షాలు, ప్రజలు కూడా ఆయనపై మండిపడుతున్నారు. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈ వ్యవహారంపై స్పందించకపోవడానికి కారణం ఏంటి ? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన తప్పు చేసారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

 

ఆర్టీసి సమ్మెలో విఫలమైన బిజెపి ఈ వ్యవహారంతో కెసిఆర్ ని... ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. చర్లపల్లి జైలు వద్ద 144 సెక్షన్ విధించింది ప్రభుత్వం... అక్కడ పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా దీనిపై ధర్నాలు చేసారు. ఇక తెలంగాణా గవర్నర్ వెళ్లి బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ ఆమె వ్యవహరి౦చిన తీరుపై ఇప్పుడు అనేక ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తు ధర్నాలు నిర్వహించాలని బిజెపి భావిస్తుంది. అదే జరిగితే రాజకీయంగా కెసిఆర్ కి ఇబ్బందికర పరిణామమే.

 

ఇక ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిందితుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే కేంద్రం ఏ నిర్ణయం అయినా తీసుకుని... వారిని తక్షణమే శిక్షిస్తే బిజెపికి అది కలిసి వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మహిళల భద్రత విషయంలో కెసిఆర్ విఫలం అయ్యారనే విషయం ప్రజల్లోకి వెళ్తుంది. పైగా బిజెపిపై నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు కెసిఆర్ ఈ వ్యవహారంపై స్పందించకుండా... బిజెపికి అవకాశం ఇచ్చారు అనే అభిప్రాయాలు ఇప్పుడు వినపడుతున్నాయి.

 

ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పందించి ఉంటే బాగుండేది అని రాజ‌కీయ‌, మీడియా మేథావులు కూడా విశ్లేషిస్తున్నారు. ఎలాంటి విష‌యంలో అయినా విమ‌ర్శ‌ల‌ను కూడా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవడంలో సిద్ధ‌హ‌స్తుడు అయిన కేసీఆర్ ఈ విష‌యంలో స్టేట్ టు నేష‌న‌ల్ వైడ్‌గా అంద‌రికి టార్గెట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: