‘కట్టుబట్టలతో వచ్చాం....లోటు బడ్జెట్ లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం’ గత ఐదేళ్లు ఈ విధంగా చంద్రబాబు బీదఅరుపులు అరుస్తూ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేసిన విషయం తెలిసిందే. ఎడాపెడా అప్పులు చేసి, పథకాలు సరిగా అమలు చేయకుండా, కావల్సిన వారికి కాంట్రాక్టులు అప్పజెప్పి, అమరావతి పేరిట గ్రాఫిక్స్ చూపించి బాబు రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలో అలాగే నాశనం చేశారు.

 

అయితే ప్రస్తుత సీఎం జగన్ మాత్రం ఎన్ని కష్టాలు ఉన్న బాబు లాగా బీద అరుపులు అరవడం లేదు. ఐదేళ్లు అప్పులు చేసి చేతిలో చిప్ప పెట్టిన.. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. ఈ ఆరు నెలలు ప్రజలకు ఏ మాత్రం కష్టం కనిపించకుండా ప్రజల మేలు కోసం అనేక పథకాలని అందించారు. అయితే ఇన్ని కష్టాల్లో కూడా జగన్ ఈ విధంగా రాష్ట్రాన్ని నడిపించారు అనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుంటే.  

 

ఇక్కడ జగన్ చేసే కొన్ని పనులని గమినిస్తే రాష్ట్రాన్ని ఎలా నడిపించారో అర్ధమవుతుంది. గత ఐదేళ్లు చంద్రబాబు ప్రభుత్వం అనవసరపు దుబారా ఎంత చేసిందో తెలుసు. కానీ జగన్ మాత్రం దుబారా మొత్తం తగ్గించారు. అలాగే ఇసుకలో దోపిడి అరికట్టి ఒక పాలసీ తీసుకురావడం వల్ల అందులో మంచి ఆదాయం వస్తుంది. అటు మద్యం షాపులని తగ్గించిన మద్యం ధరలు ఎక్కువ పెట్టడం వల్ల పెద్దగా ఆదాయంలో తేడా రాలేదు. కొంతవరకు వచ్చిన అది ప్రజల శ్రేయస్సు కంటే ఆదాయం ఎక్కువ కాదని లైట్ తీసుకున్నారు.  

 

రివర్స్ టెండరింగ్ అనేది అనుకున్నదానికంటే ఎక్కువగా విజయవంతమైంది. దీని వల్ల వందల కోట్ల ప్రజా ధనం ఆదా అయింది. అలాగే ముందు నుంచి హడావిడి కార్యక్రమాలని పక్కనబెట్టేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదాహరణకు అమరావతి నిర్మాణం. బాబు లాగా హడావిడి చేయకుండా నిదానంగా కావల్సిన భవనాలు నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. అటు వర్షాలు కూడా బాగా పడటంతో వ్యవసాయంలో కూడా మంచి ఆదాయం వచ్చేలా కనిపిస్తుంది.

 

వీటికంటే ముఖ్యంగా లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల నిరుద్యోగం తగ్గి, వారి కుటుంబాల తలసరి ఆదాయం పెరగనుంది. తలసరి ఆదాయం పెరిగితే ఆటోమేటిక్ గా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే అప్పులు చేసిన వాటిని సక్రమ మార్గంలో వినియోగిస్తున్నారు. ఈ విధంగా జగన్ హడావిడి లేకుండా సరైన విధానంలో ధైర్యంతో పాల‌న చేస్తున్నారు. అదే ఆయ‌న‌కు శ్రీరామ‌ర‌క్ష‌గా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: