పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.  అక్కడి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు.  మీటింగ్లు పెడుతున్నారు.  అందరిని కలిసి మాట్లాడుతున్నారు.  అక్కడితో ఆగకుండా అధికారంలో ఉన్న వైకాపాపై ఎప్పుడు లేనంతగా విరుచుకుపడుతున్నారు.  23 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ వైకాపా గురించి మాట్లాడేందుకు భయపడుతుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా వైకాపాను ఎడాపెడా వాయించేస్తున్నాడు.  


తన పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు.  సున్నితమైన అంశాలను లేవనెత్తుతూ.. వైపాను ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు.  సత్యం మాట్లాడే వాడికి ధైర్యం ఎక్కువగా ఉంటుందని, ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చానని, ప్రాణం పోయినా పర్వాలేదని, లక్ష్యం కోసం పోరాటం చేయడం ఒక్కటే తెలుసు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు.  


2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి సపోర్ట్ చేశారు.  ఈ రెండు పార్టీలకు సపోర్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. కానీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో వెనకడుగు వేయడంతో ఆ రెండు పార్టీలపై యుద్ధం ప్రకటించారు.  మంగళగిరిలో పవన్ కళ్యాణ్ పెద్ద సభను ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.  


అటు బీజేపీపై కూడా అయన అప్పట్లో విరుచుకుపడ్డారు.  ఈరోజు అమిత్ షా గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో.. వైకాపా నేతలు జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని, అందుకే షా గురించి మాట్లాడారని అంటున్నారు. బీజేపీలో విలీనం చేయడం కోసం గ్రౌండ్ స్థాయిలో పధకాలు వేస్తున్నారని అందుకే పవన్ అలా మాట్లాడుతున్నారని వైకాపా నేతలు అంటున్నారు. అయితే పవన్ మాత్రం తాను ఎవరితోనూ కలవబోనని అంటున్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసమే తాను బీజేపీకి దూరం అయ్యానని, బీజేపీతో ఎలా కలుస్తానని పవన్ ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: