రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీంతో మహిళలు కాలు బయటకు పెట్టాలనే  ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు మహిళలు అర్ధరాత్రి నిర్భయంగా రోడ్డుమీద తిరిగినప్పుడే అసలైన  స్వాతంత్రం వచ్చిందని గాంధీ  చెప్పినప్పటికి ప్రస్తుత పరిస్థితులు మాత్రం అర్ధరాత్రి కాదు కనీసం పగటిపూట కూడా రోడ్డు మీద తిరగలేని  పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి చోట అమ్మాయిలకు రక్షణ కరువు అవుతూనే ఉంది. రోడ్డుపై నడుస్తుంటే ఆకతాయిల తో... చదువుకోవడానికి వెళ్తే కామాంధులైన గురువులతో... ఇంట్లో ఉంటే వావివరసలు మరిచి  కామపు కళ్ళతో లైంగిక దాడి చేసే సొంత వాళ్ళతో ఇలా ప్రతి చోట మహిళలపై లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి.

 

 

 తాజాగా హైదరాబాద్ షాద్నగర్ వైద్యురాలు  దిశ రేప్ అండ్ మర్డర్ ఘటన  ప్రస్తుతం దేశ ప్రజానీకాన్ని కలచివేసింది. 4 గురు నిందితులు  పథకం ప్రకారం దిశ అనే వైద్యురాలిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడాలంటు  డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఆడపిల్లల పై దాడులు జరిపే మనుషుల్లా  కనిపించే కుక్కలకి  ఉరిశిక్ష విధించి  చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు మీరు చంపకపోతే బయటికి పంపించండి మేము చంపి చూపిస్తానంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం దిశా ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 

 

 వి వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు ప్రజలు. అయితే వైద్యురాలు దిశ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు జరుగుతుంటే.. దిశ లాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అమ్మాయిని రేప్ చేసి చంపిన కాల్చేసిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.బక్సర్  జిల్లాలోని కుకుంద గ్రామంలో... నిన్న రాత్రి ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో అమ్మాయి సగం కాలిపోయి ఉండడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పోస్టుమార్టం తర్వాత మిగతా విషయాలను వెల్లడిస్తామని... బక్సర్  డిఎస్పి సతీష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: