ముస్లింలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ , రాజ్యాంగం పై తమకు పూర్తి విశ్వాసం ఉందని  అయోధ్య విషయంలో అల్  ఇండియా ముస్లిం  పర్సనల్  లా బోర్డు  సుప్రీంకోర్టులో సమీక్ష  పిటిషన్ దాఖలు చేస్తోందని   ఎఐఎంఐఎం  నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసి అన్నారు.

 

 

ఎమ్మెల్యే మరియు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్ ( ఎఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి యొక్క తమ్ముడైన  అక్బరుద్దీన్ ఒవైసి 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైన వారికి శిక్ష ఎప్పుడు లభిస్తుందో అని ఆశ్చర్యన్నీ   వ్యక్తం చేశారు.  యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ, మత పండితులు మరియు ఇతర నాయకులు  డిసెంబర్ 6  వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా  ఏర్పాటు చేసిన సమావేశంలో ఒవైసి మాట్లాడారు.

 

 

మసీదును కూల్చివేసిన వివాదాస్పద స్థలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఆలయాన్ని నిర్మించాలని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నవంబర్ 9 న తీర్పు ఇచ్చింది.

 

 

మాకు న్యాయం మీద నమ్మకం ఉంది.  ఆ విశ్వాసం  సమీక్ష  పిటిషన్  దాఖలు చేయమని చెబుతోంది. ఈ దేశ రాజ్యాంగంపై మాకు నమ్మకం ఉంది.  ఈ దేశ న్యాయస్థానం పై మాకు నమ్మకం ఉంది. అందుకే మేము పిటిషన్ దాఖలు చేస్తున్నాము. దీనిని తప్పు గా అర్థం  చేసుకోకూడదు  అని అక్బరుద్దీన్ ఒవైసి అన్నారు.

 

 

 ఈ  సమావేశంలో ఆమోదించిన తీర్మానం, ఎఐఎంఐఎం మీడియాకు విడుదల చేసింది, ఈ  తీర్మానం ప్రకారం  బాబ్రీ మసీదు / రామ్ జన్మభూమి టైటిల్ సూట్ పై తీర్పు ముస్లింలకు ఆమోదయోగ్యం కాదు  అని అన్నారు. ఈ సమావేశ తీర్మానం టైటిల్ సూట్ పై సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పునర్విమర్శ పిటిషన్ దాఖలు చేయాలనే  అల్  ఇండియా ముస్లిం  పర్సనల్  లా బోర్డు  నిర్ణయానికి  మద్దతు ఇచ్చింది. ప్రతిరోజూ కోర్టు టైటిల్ సూట్ విన్నట్లే, కూల్చివేతకు పాల్పడిన నేరస్థులపై క్రిమినల్ కేసు కూడా ప్రతిరోజూ విచారించబడాలని, త్వరలో తీర్పు ఇవ్వాలని సమావేశం కోరింది.

 

 

డిసెంబర్ 6 న బాబ్రీ మసీదు  కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య మరియు శాంతియుతంగా నిరసనలు జరపాలని  మరియు మసీదు పునర్నిర్మాణం కోసం ప్రార్థనలు చేయాలి అని సమావేశంలో తీర్మానించారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: