పాకిస్తాన్‌తో యుద్ధం వస్తేనే రగిలిపోతారనుకున్న జనం దిశ హత్యాచార ఘటనతో  కూడా అగ్గిలా రగులుతున్నారంటే ఇంకా మానవత్వం అక్కడక్కడ మిగిలే ఉంది. ఇకపోతే "దిశ" మానభంగం విషయంలో ప్రతి వారు తమకు తోచిన విధంగా స్పందిస్తూ, నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరు దాదాపుగా స్పందిస్తూ ట్విట్‌లు చేస్తున్నారు.

 

 

ఇకపోతే దిశ హత్యచార ఘటనలో స్పందించిన వారిలో సినీ నటి మాధవీలత ఒకరు. ఈమె సోషల్ మీడియాలో రేపిస్టులు అంటే ఎలా ఉంటారో ఫస్ట్ టైం చూశా.. ఇలాంటి ఎదవల్ని బహిరంగంగా నరికి చంపేయాలి. ఏదైతే మగతనం అని అనుకుంటున్నాడో దాన్ని కోసి కారం పెట్టాలంటూ ఫైర్ అయ్యింది. ఇక నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత వెటర్నరీ డాక్టర్ దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అసమర్ధతను ఎండకడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోషల్ మీడియా వేదికగా నిలదీసింది. దీంతో ఆమెపై ఓ నెటిజన్ నోరు పారేసుకుంటూ ‘ఏందే నీ గోల. నీ లాంటి వాళ్లు ఉంటే ఇలానే చంపేస్తారు’ అంటూ  కామెంట్ చేశాడు. అతనే కాకుండా చాలా మంది మాధవీలతను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు.

 

 

దీంతో సహనం కోల్పోయిన మధవీలత సోషల్ మీడియాలో ఘాటైన పోస్ట్ పెట్టింది. తనపై నీచమైన కామెంట్స్ చేసిన నెటిజన్లను ఏకిపారేస్తూ బండ బూతులతో ఫేస్‌ బుక్‌లో పోస్ట్ వదలింది. ఆడపిల్లకి అన్యాయం జరిగింది మొర్రో అంటుంటే.. నా వాల్‌లోకి వచ్చి పిచ్చి వాగుడు వాగే కుక్కలు తోడేళ్ళ ముఖాలు. సిగ్గు, లజ్జ, మర్యాద ఉందిరా మీకు? మీలాంటి చెత్త డాష్ గాళ్లనీ కూడా నరికేయాలి. నోటికొచ్చినట్లు వాగుతార్రా అమ్మకి పుట్టవా అడ్డ గాడిదకు పుట్టవా? అంతూ దారుణమైన తిట్లు తిట్టింది.

 

 

ఇదే కాకుండా రేప్ చేస్తే సుఖమా? పోయి చెట్టు తొర్రలో పెట్టుకొండ్రా.. కుక్కల్ని పట్టుకుని చేయండి. ఆ కుక్కలకి కూడా కాలితే ఏం చూసుకుని మగాడు అని విర్రవీగుతున్నారో దాని పీక్కు తింటాయి. తెగబలిసిన సంకరజాతి కుక్క బతుకు మనుషుల్లారా నీది ఒక బతుకేనా? నీది ఒక జన్మేనా? నాది నాది అని విర్రవీగిన నీ నరాలు తెగ్గోస్తాం అంటూ పూనకం వచ్చిన దానిలా ఊగిపోయింది. మొత్తానికి దిశ ఘటన మాధవీలతను తీవ్రంగా కలచివేసినట్లు ఉందంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: