పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడన్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశారు. ఆ ప్రభావమో మరేమో కానీ ఆయన వాస్తవాలకు దూరంగా ఉంటున్నారు. ఊహాలోకంలోనే విహరిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. పవన్ తాను లేస్తే మనిషిని కానంటారని, నెలకు ఒకసారి వచ్చి మీడియా ముందు ఎంటర్టైన్ చేస్తారని కూడా వైసీపీ మంత్రులు అంటున్న సంగతి విధితమే.

 

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. రాయలసీమ పర్యటనలో గత  మూడు రోజులుగా ఆయన అదే పనిగా జగన్ని విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన పార్టీ మీటింగులో మాట్లాడుతూ తాను కనుక విలువలు, సిధ్ధాంతాలను  వదిలేసి ఉంటే ఏపీలో జగన్ గెలిచేవారా అని సూటిగా ప్రశ్నించారు.  జగన్ గెలుపును అడ్డుకునే శక్తి తనకు ఉన్నా తాను కొన్ని సిధ్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని కూడా ఆయన చెప్పుకున్నారు.

 

తాను విలువలు, ఆశయాలు  పక్కన పెట్టి 2019 ఎన్నికల్లో మోదీ దగ్గరకు వెళ్ళి  చేతులు కలిపినట్లైతే వైసీపీ గెలిచేదా అని ఆయన ప్రశ్నించారు.  దీని మీద కూడా ఇపుడు ఒక్కటే  సెటైర్లు పడుతున్నాయి. 2014లో పవన్, బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేసినపుడే జగన్ పార్టీ కేవలం అయిదు లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలు అయిందని వైసీపీ నేతలు అంటున్నారు.

 

2019 ఎన్నికల నాటికి  అంతకంటే రెట్టించిన ప్రజాదరణతో జగన్ ఉన్నారని, మళ్ళీ మూడు పార్టీలు కలసినా జగన్ దే గెలుపు అని తెలిసే విడిగా పోటీ చేసి ఓట్ల చీలికకు తెర తీశాయని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. అది విఫలం కావడంతో ఇపుడు పవన్ తాను బీజేపీతో చేతులు కలిపినట్లైతే జగన్ ఓడిపోతారని చెప్పడం అవాస్తవ‌మైన విశ్లేషణ అంటున్నారు.

 

ఇవన్నీ పక్కన పెడితే గడచిన ఆరు నెలలుగా పవన్ చేస్తున్న ప్రకటనలు చూస్తే ఆయన జగన్ని ముఖ్యమంత్రిగా అంగీకరించేలా కనిపించడంలేదని మంత్రులు అంటున్నారు. ఎవరు అవునన్నా కాదనన జగన్ సీఎం అని అందువల్ల పవన్ వాస్తవాల్లోకి రావాలని కూడా సూచిస్తున్నారు. జగన్ని సీఎం గా పట్టించుకోను అని పవన్ అంటే తాము పవన్ని అసలు రాజకీయ నేతగా కూడా పట్టించుకోమని మంత్రులు పేర్ని నని, కొడాలి నాని అంటున్నారు. మరి ఈ మాటల యుధ్ధం ఎందాక వెళ్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: