ఏపీ రాజకీయాల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. రాజకీయాల్లో ఎదగడానికి పవన్ తాపత్రయపడుతున్నాడు. బీజేపీతో సావాసం కోసం టీడీపీ తాపత్రయపడుతోంది. బలమైన బీజేపీతో వైసీపీ సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఎదగాలని బీజేపీ చూస్తోంది. ఇలా నాలుగు పార్టీలు ఎవరికి వారు తమ పావులు కదుపుకుంటున్నారు. అయితే.. వైసీపీ – టీడీపీలకు సొంత బలం, బలగం ఉన్నాయి. బీజేపీకి, జనసేనకు మాత్రం తగినంత బలం లేదు. ఏపీ రాజకీయాల్లో నెగ్గుకురావాలన్న వీరిద్దరి కల నెరవేరాలంటే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

 

మొన్నటి ఎన్నికల ముందు బీజేపీని తిట్టిన తిట్లకు టీడీపీని కనీసం దగ్గరకి రానిచ్చేలా లేదు బీజేపీ. వైసీపీ చూస్తే భారీ ప్రజాదరణతో ఎన్నికల్లో ఘనమైన విజయం సాధించి పటిష్టంగా ఉంది. దీంతో టీడీపీని పక్కన పెట్టేసినా వైసీపీని ఢీ కొట్టాలంటే సొంతంగా ఏ ఒక్కరి వల్లో అయ్యేలా లేదు. ఇప్పటికే జగన్ పై ఇసుక, ఇంగ్లీషు మీడియం, కులం.. అంశాలతో తీవ్ర విమర్శలు చేస్తున్నాడు పవన్. బీజేపీ నాయకులు కూడా జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. పరిస్థితుల దృష్ట్యా ఇరు పార్టీలు కలిస్తే.. అనే ఆలోచన రాజకీయ వర్గాల్లో ప్రస్తావనకొస్తోందని సమాచారం. రీసెంట్ గా పవన్ మాట్లాడుతూ అమిత్ షా వంటి బలమైన నాయకుడు దేశానికి అవసరం అనేశాడు. దీంతో జనసేన-వైసీపీ దోస్తీపై ఊహాగానాలు పెరిగిపోయాయి.

 

 

ఇదే జరిగితే బీజేపీ అండ జనసేనకు ఉంటుంది.. జనసేన బలం బీజేపీకి తోడవుతుంది. దీంతో టీడీపీని రానివ్వకుండా బీజేపీకి అవకాశం చిక్కుతుంది. వైసీపీపై పైచేయి సాధించేందుకు జనసేనకు అవకాశం దక్కుతుంది. తెర వెనుక ప్రస్తుతం ఇవే పరిణామాలు జరుగుతున్నాయనేది ఓ వాదన. మరి రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు అనే మాటకు ఈ వార్తలు బలం చేకూరుస్తున్నాయనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: