ప్రపంచంలోని ప్రతి దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మానసిక, శారీరక వేధింపులు జరుగుతూనేఉన్నది .  ఒక్క భారతదేశంలోనే ఎక్కువగా జారుతున్నాయని అనుకుంటే అది పొరపాటే. ఆఫ్రికా ఖండంలో ఈ సంఖ్య మరింత అధికంగా ఉన్నది.  గల్ఫ్ దేశాల్లోనూ ఈ సంఖ్య అధికంగా ఉన్నది.  కానీ, బయటకు వచ్చే నేరాల సంఖ్య  చాలా తక్కువగా ఉంటోంది.  కారణం, భయం.  అభద్రతా భావం.  భయం, అభద్రతా భావం కారణంగానే మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి.  


ఐరాస మహిళ భద్రత గురించి ఆందోళన చెందుతున్నది.  దీనిపై నిర్వహించిన సర్వే గురించిన నిజాలు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.  ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు అత్యాచారానికి గురవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.  మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో తిరగాలంటే భయపడుతున్నారని, వారిని భయపడకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంపై ఉందని అంటోందిఐరాస .  

 

మహిళల భద్రతకు ఐరాస కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.  వాటిని తప్పకుండా అమలు చేయాలని ప్రపంచంలోని అన్నిదేశాలను కోరింది.  ప్రతి ఒక్కరు ఈ విషయంలో తప్పకుండా ఈ మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది.  ఈ మార్గదర్శకాలు పాటిస్తేనే ప్రజలు క్షేమంగా  ఉంటారని, మహిళలపై కొంతవరకు ఇబ్బందులు పడకుండా క్షేమంగా బయటపడతారని అంటున్నారు.  ఆ మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

 

స్త్రీలకు సురక్షితమైన బహిరంగ ప్రదేశాలుండాలి. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండకూడదు. పురుషుల హక్కులను కాపాడుతూ స్త్రీ అణచివేతను సమర్థించే నిబంధనలను తొలగించాలి. మహిళలకు చట్టబద్ధమైన, సామాజిక రక్షణలు మాత్రమే సరిపోవని, రాజకీయ సంకల్పం ఉండాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. మహిళలపై హింసను పరిష్కరించడానికి కార్యక్రమాలు, పరిశోధనలు, ఆరోగ్యం, విద్య, చట్టం అమలు, సామాజిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వనరులు కేటాయించాలి. మహిళా సాధికారత పెరగాలి. పేదరికం తగ్గించాలి. ప్రభుత్వాలు మహిళలపై హింసను అంతం చేయాలి.  ఈ మార్గదర్శకాలను ప్రతి దేశం తప్పకుండ అమలు చేయాలని నిరాశా ఈ సందర్భంగా కోరింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: