మహారాష్ట్రలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు.  2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత అక్కడ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తమకు అవకాశం ఇవ్వాలని కోరిన శివసేనను బీజేపీ కాదని చెప్పింది.  కారణం ఏంటి అంటే... ఆ రాష్ట్రంలో పార్టీకి 105 సీట్లు వచ్చాయి. శివసేనకు కేవలం 54 సీట్లు మాత్రమే వచ్చాయి.  ఏ విధంగా చూసుకున్నా అది కుదరని పని.  అందుకే కూటమిలో భాగంగా ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు.  


దీంతో బీజేపీ కూటమి నుంచి శివసేన బయటకు వచ్చింది.  అలా బయటకు వచ్చిన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టింది.  ఇంకేముంది రాజకీయాలు రంగులు మారాయి.  అసలు శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీతో కలుస్తుందని ఎవరూ ఊహించలేదు.  ఊహించని సంఘటనలు కావడంతో బీజేపీ షాక్ అయ్యింది.  చాలాకాలం పాటు వేచి చూసింది.  కుదరలేదు.  పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను మోడీ పొగడటం, శరద్ పవార్ మోడీని కలవడం, కలిసి పనిచేద్దామని మోడీ చెప్పడం వంటివి జరిగిపోయాయి.  


దీంతో అజిత్ పవార్ బీజేపీకి దగ్గరయ్యారు.  ఫడ్నవీస్ కు అజిత్ పవార్ దగ్గరయ్యారు అనే విషయం తెలిసిన తరువాత కూడా శరద్ పవార్ సైలెంట్ గా ఉన్నారు.  అప్పటికే మూడు పార్టీల మధ్య కనీస ఉమ్మడి ప్రణాళిక ఏర్పడటంతో.. శరద్ పవార్ ఏమి చేయలేకపోయారు.   అజిత్ పవార్ ప్లేట్ ఫిరాయిస్తాడని అసలు అనుకోలేదు.  అజిత్ పవార్ ఫడ్నవీస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పెద్ద డ్రామా నడిచింది.  ఆ తరువాత ఆ డ్రామాకు తెర పడింది అనుకోండి.  


అజిత్ పవార్ తిరిగి సొంత గూటికి వెళ్లడం, తిరిగి పార్టీలో జాయిన్ కావడం.. అజిత్ పవర్ కు కూడా కూటమిలో పదవి ఇస్తుండటంతో ప్రస్తుతానికి మహారాష్ట్ర కథ సైలెంట్ గా నడుస్తున్నది.  అక్కడి రాజకీయాలు సైలెంట్ గా ఉన్నాయి.  అయితే, సంకీర్ణ కూటమి మూడు నాళ్ళ ముచ్చటే అని అంటున్నారు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం పనిచేస్తుందో చూడాలి.  .  

మరింత సమాచారం తెలుసుకోండి: