ఇటీవ‌లె జ‌రిగిన దిశ హ‌త్యాచార‌ ఘ‌ట‌న రెండు రాష్ట్రాల‌ను క‌దిలించేసింది. మాన‌వ మృగాళ్ల ఆగ‌డాల‌కు ఎక్క‌డా హ‌ద్దులు లేకుండా పోయింది. అత్యంత క్రూరంగా ప‌శువుల్లా ఆమెను అత్యాచారం చేసి, త‌ర్వాత ఆమెను హ్య‌త్య చేశారు. అది చాల‌దంటూ ఆమెను ఘోరంగా పెట్రోలు పోసి మ‌రి త‌గ‌ల బెట్టారు.  అయితే ఇదిలా ఉంటే ఈ కేసులో మ‌రో దారుణం  వెలుగులోకి వ‌చ్చింది. ఆమెతో బ‌ల‌వంతంగా మ‌ధ్యం తాగించి ఆమె అర‌వకుండా గ‌ట్టిగా ఆమె నోరు మూసి చంపేసి త‌ర్వాత పెట్రోలు పోసి త‌గ‌ల‌బెట్టారు. కానీ, ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు చర్లపల్లి జైల్లో ఉన్న కీలక నిందితుడు ఆరిఫ్‌ కొందరు కిందిస్థాయి అధికారులకు చెప్పిన విషయం బయటకు వచ్చింది.


చర్లపల్లి జైలులో ప్రత్యేక నిఘాలో ఉన్న నిందితులతో కొంతమంది జైలు సిబ్బంది మాట్లాడినప్పుడు ఆరిఫ్‌ కనీసం భయపడకుండా పలు విషయాలు బయటపెట్టినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన రోజున ఆరిఫ్‌ సహా మరో ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కుని వెళ్తుంటే ఆమె రక్షించండంటూ పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులు ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు వెంటనే తన జేబులోని మద్యం సీసా తీసి బలవంతంగా ఆమె నోట్లో పోశాడు.

అప్పటికే భయపడి ఆందోళనతో ఉన్న దిశ స్పృహ కోల్పోవడంతో ఆమె నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆమెను లారీలోకి ఎక్కించి అందులోనూ మళ్లీ అత్యాచారం చేశారు. మద్యం తాగించి, పాశవికంగా అత్యాచారానికి పాల్పడంతో బాధితురాలు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె చనిపోయినట్లుగా భావించి చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువెళ్లి బతికి ఉండగానే పెట్రోల్‌ పోసి నిప్పటించారు. కాగా, దిశ కేసు నిందితులు ఉన్న సెల్‌ను చ‌ర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ ఎం.సంపత్‌ మంగళవారం పరిశీలించి వారితో మాట్లాడారు. ఇంత ఘోరంగా ఉన్న వీళ్ళ‌కు ఎలాంటి శిక్ష విధించిన చిన్న‌దే. అయితే ఈ చ‌ర్య‌లు ఎంత త్వ‌ర‌గా తీసుకుంటే అంత మంచిది క‌నీసం దిశ కు న్యాయం జ‌రిగిన‌ట్లు ఉంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: