రోజా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.  రాజకీయాల్లో మంచి ఫామ్ లో ఉండగానే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ చాలాకాలం ఉన్నది.  అప్పట్లో ఒకసారి ఆమెకు చంద్రగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నారు.  కానీ, సొంతపార్టీలోని మనుషులే తన తనను ఓడించేలా చేసారని ఆమె వాపోయిన సంగతి తెలిసిందే.  


ఆ తరువాత రోజా అక్కడి నుంచి బయటకు వచ్చారు.  కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకున్నా కొన్ని కారణాల వలన జాయిన్ కాలేదు.  కానీ, 2011 లో వైకాపా స్థాపించినప్పటి నుంచి రోజా జగన్ పార్టీలోనే ఉన్నారు.  జగన్ తో కలిసి పనిచేశారు.  ఇప్పటికి కలిసి పనిచేస్తూనే ఉన్నారు.  2014, 2019లో రోజా ఎమ్మెల్యేగా గెలుపొందారు.  రాజకీయాల్లో ఉన్నప్పటికీ జబర్దస్త్ వంటి కామెడీ షోలు చేసుకోడానికి జగన్ నుంచి అనుమతి ఉన్నది.  


2019 ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రోజాకు మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నారు.  కానీ, పార్టీ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు.  ప్రస్తుతం రోజా ఏపిఐఐసి చైర్మన్ గా పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈ పదవిలో ఉంటూనే రోజా జబర్దస్త్ కార్యక్రమం చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు సినిమాలో నటించాలని అనుకుంటున్నారు.  


బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో ఓ పవర్ ఫుల్ సినిమా రాబోతున్నది.  అందులో రోజాకు ఓ పవర్ ఫుల్ పాత్రను క్రియేట్ చేశాడు బోయపాటి.  ఆ పాత్ర రోజాకు కూడా నచ్చింది.  బాలయ్య కూడా రెండు మూడు సార్లు రోజాను కలిసి పాత్రను చేయాలని కోరారట.  అయితే, రోజా మాత్రం ఈ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేకపొతున్నది.  ఎందుకంటే, రోజా ఇప్పుడు సినిమా చేయాలి అంటే జగన్ అనుమతి అవసరం.  జగన్ అనుమతి ఇస్తేనే రోజా సినిమా చేస్తుంది.  బాలయ్య సినిమాలో పాత్ర గురించి రోజా ఇప్పటికే జగన్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.  ఇకపోతే, రోజా.. బాలయ్యలు కలిసి మొత్తం 7 సినిమాలు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: