కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక దేశం ఒక రేషన్ కార్డు విధానం అమలు చేయాలనే నిర్ణయం దీనిద్వారా చాల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధి కోసం లేదా దేశవ్యాప్తంగా తమ నివాస చిరునామా మార్చుకునే వలస కార్మిక లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఇతర రంగాల కార్మికులకు ఈ వ్యవస్థ ప్రయోజనం చేకూరుస్తుంది అని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ధ్రువీకరణను సమన్వయం చేయడానికి ప్రభుత్వం ‘వన్‌ నేషన్‌ వన్‌ స్టాండర్డ్‌’పై కృషి చేస్తోందని చెప్పారు.

 

 

ఇక ఈ విధానం జూన్ ఒకటో తేదీ నుంచి దేశమంతా అమలులోకి వస్తుందని కేంద్ర వినియోగదారుల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఒక ప్రకటనలో ప్రకటించారు. లోకసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బీజేపీ సభ్యుడు గణేష్ సింగ్ అడిగిన ప్రశ్నకు పాశ్వాన్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఇకపోతే 2022 సంవత్సరం నాటికి ఒకే దేశం ఒకే నాణ్యతను కూడా అమలులోకి తెస్తామని ఆయన తెలిపారు.  అయితే ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అంతర్గతంగా తమ, తమ రాష్ట్రాల పరిధిలో ఒక దేశం ఒక రేషన్ కార్డు విధానం అమలు జరుగుతోంది, అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా దీనిని అమలు చేసేందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి, జూన్ ఒకటో తేదీ నుండి దేశమంతటా ఒక దేశం ఒక రేషన్ కార్డు విధానం అమలులోకి వస్తుందని పాశ్వాన్ తెలిపారు.

 

 

ఇక నీతి అయోగ్ రూపొందించిన విధానం మేరకు రెండు రూపాయలకు కిలో చొప్పున గోధుమలు, మూడు రూపాయలు కిలో చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి గోధుమలను ఇరవై రూపాయలకు కిలో, బియ్యం ముప్పై రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి రాయితీ ధరలకు బీద ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తోందని, రేషన్ బియ్యం, గోధుమల లబ్ధిదారులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని, బీద ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న ఆహార ధాన్యాల ధరలను పెంచడం లేదని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: