గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ గారు ఇంటి ఇంటికి రేషన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే !కానీ అది ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. కానీ మిగతా జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం ప్రజలకు అంద చేయాలి అన్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సీఎం గారు.ఇది అందరికి హర్షనీయం.

బియ్యం కొనుక్కోడానికి డబ్బులు లేని వారు పాత గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యాన్ని తినేవారని అది చూడలేని సిఎం అందరికి సన్నబియ్యం ఇచ్చే ఆలోచిన చేసారు. ఎక్కడో రేషన్ షాప్ కి వెళ్లి తెచ్చుకోకుండా మన ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేలా గ్రామ వాలంటీర్లకు ఉపాధి కల్పించారు. గ్రామ వాలంటరీ ప్రతినెల మన ఇంటికి వచ్చి అందజేస్తారు నాణ్యమైన బియ్యం పంపిణీపై సోమవారం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు
ఈ మీటింగ్ లో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా హాజరు అయ్యారు.

నాణ్యమైన బియ్యం పంపిణీ విషయంలో ప్రజలు సంతోషిస్తారని సీఎం గారికి తెలిపారు దీంతో 2020 ఏప్రిల్ నుండి ఇంటింటికి రేషన్ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.రేషన్ తీసుకోడానికి ఎక్కడికి వెళ్లవలిసిన పని లేదు.. ఇంటికే ఇస్తామన్నారు. గ్రామ వాలంటీర్ ప్రతి ఒక్క ఇంటికి వచ్చి సరఫరా చేస్తారు అన్నారు. 


ఇప్పటిదాకా ప్రతిపక్షాలు ఎక్కడ సన్నబియ్యం పంపిణి జరగలేదని అధికార పక్షాన్ని ప్రశ్నించారు. మంత్రి కొడాలినానిపై కూడా విమర్శలు చేసారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకి దీటుగా సిఎం స్పందించి సన్నబియ్యం పంపిణి విషయమై క్లారిటీ ఇచ్చి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలుచెయ్యాలని నిర్ణయం తీసుసుకుని దానికి కావలిసిన ఆదేశాల్ని జారీ చేసారు. ఇది అమలు అయితే ప్రతి పేదవాడు సంతోషిస్తాడు. రెండు పూటలా భోజనం చేస్తాడు 

మరింత సమాచారం తెలుసుకోండి: