తెలుగుదేశంపార్టీ నేతలు వెనకాడుతున్నారా ? పార్టీలో జరుగుతున్న చర్చల సారంశం ప్రకారమైతే అలాగే అనుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో అంటే మార్చిలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉంది కాబట్టి వైసిపి తరపున పోటీ చేయటానికి నేతలు ఎటూ  పోటిలు పడతారు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితే ఏమిటో అర్ధం కావటం లేదట.

 

మొన్నటి ఎన్నికల్లో తగిలిన గట్టి దెబ్బ నుండి ఇంకా చంద్రబాబునాయుడు అండ్ కో కోలుకోలేదని అర్ధమైపోతోంది.  ఓటమిని అంగీకరించలేకే జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటేనే ఓటమి దెబ్బ చంద్రబాబుపై ఎంతలా ప్రభావం చూపిస్తోందో తెలిసిపోతోంది. చంద్రబాబు, లోకేష్ నాయకత్వాల మీద నమ్మకం లేకే చాలామంది నేతలు ఎవరిదారి వాళ్ళు చూసుకుందామని నిర్ణయించుకున్నారు.

 

దానికితోడు రాష్ట్రంలో టిడిపి ఓడిపోయి కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడి ప్రధానమంత్రి కాగానే నలుగురు టిడిపి రాజ్యసభ ఎంపిలను చంద్రబాబే స్వయంగా బిజెపిలోకి పంపేశారు. వాళ్ళని చంద్రబాబు ఏ కారణాలతో పంపినా దాని ప్రభావం మిగిలిన నేతలపై బాగా పడింది. తన భవిష్యత్తును చంద్రబాబు తాను చూసుకుంటున్నపుడు మనం మాత్రం ఇంకా టిడిపిలోనే ఎందుకు అనే ప్రశ్న నేతల మధ్య బాగా నలుగుతోంది.

 

అందుకనే అవకాశం ఉన్న వాళ్ళు బిజెపిలోకో వైసిపిలోకో వెళ్ళిపోతున్నారు. ఇంకా అవకాశం రానివాళ్ళు చంద్రబాబుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ తరపున పోటి చేయటానికి సీనియర్ నేతల్లో చాలామంది ఆసక్తి చూపటం లేదని సమాచారం. ఎవరైనా పోటి చేయటానికి రెడీ అయినా గెలుసు గ్యారెంటీ లేదుకదా. ఈ మాత్రానికి పోటి చేసి డబ్బు తగలేసుకోవటం ఎందుకని చాలామంది పోటికి వెనకాడుతున్నారట.

 

పైగా ఎక్కడైనా టిడిపి తరపున గెలిచినా చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉండే వైసిపి ప్రభుత్వంలో టిడిపి తరపున గెలిచిన వాళ్ళు చేయగలిగేది కూడా ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే. అందుకనే పార్టీ తరపున పోటి చేయటానికి వెనకాడుతున్నారట.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: