ఆంధ్ర ప్రదేశ్ లో  మద్యపాన నిషేధానికి సంబంధించి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే కదా. అయితే తాజాగా హైకోర్టులో సర్కార్ కు చుక్కెదురైంది. ఆరు నెలల గడువు ఉండగానే ప్రస్తుతం ఉన్న బార్ల లెసెన్సులను రద్దు చేయడం పై హైకోర్టు స్టే విధించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న బార్ల గడువు తీరక ముందే ఎలా లైసెన్సులను రద్దు చేస్తారని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది.

 

డిసెంబర్ 7 కల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. ఈ నెల 16 కల్లా తమ స్పందనతో కౌంటర్ వేయాలని బార్ల యజమానులను కోర్టు ఆదేశించడం జరిగింది. దీంతో జనవరి 7న జరగాల్సిన బార్ల లైసెన్సుల డ్రాను వాయిదా వేయడం జరిగింది. ఇక మరో వైపు డిసెంబర్ 23కు  కోర్టు కేసు విచారణను వాయిదా వేయడం జరిగింది. 


 
ఇది ఇలా ఉండగా.. కొత్త బార్లకు వ్యాపారుల నుంచి ఎలాంటి స్పందన కనపడడం లేదు . కొత్త లైసెన్సులకు 5 రోజుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు అంటే నమ్మండి. బార్ లైసెన్సు కావాలంటే రూ.10 లక్షలు చెల్లించవలసి ఉంటుంది. ఒక వేళా  లాటరీలో షాపు రాకుంటే ఇక పైసలు తిరిగి రావు. దీంతో బార్ల లైసెన్సుల కోసం కొత్తగా ఎవరూ కూడా దరఖాస్తు చేసేందుకు ముందుకు రావడం లేదు అని బాగా అర్థం అవుతుంది.  

 

ప్రభుత్వం లైసెన్సు ఫీజు తగ్గించడమా లేకుంటే షాపు తలగని వారికి తిరిగి పైసలు ఇవ్వడమో చేస్తే తప్ప పరిస్థితి మారేలా లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియ చేస్తున్నారు. ఇక మరో వైపు వ్యాపారస్తులు లైసెన్స్ కోసం రూ. 10 లక్షలు కట్టాల్సి రావడం తమపై భారమేనని వాళ్ళ భావన తెలుపుతున్నారు.  మేము కోర్టులో స్పష్టత వచ్చిన తరువాతే ముందడుగు  వేస్తాము అని వ్యాపారస్తులు తెలియ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: