కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల జైలుకు వెళ్లడం జరిగింది. దీంతో పలుమార్లు చిదంబరం అరెస్ట్ అయిన నేపథ్యంలో న్యాయస్థానానికి బెయిల్ కోసం ఆశ్రయించగా తిరస్కరించిన క్రమంలో తాజాగా దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల...చిదంబరం నవంబర్ 28వ తారీఖున అప్లై చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తాజాగా చిదంబరానికి బెయిల్ ఇచ్చినట్లు సుప్రీం న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో సుప్రీమ్ న్యాయస్థానం రెండు లక్షల పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 21వ తారీఖున చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ (ఈ డి) అరెస్టు చేయగా చిదంబరం సుమారు 105 రోజుల జైలు జీవితం గడపటం జరిగింది.

 

అయితే తాజాగా ఆయనకు విముక్తి లభించింది. అంతేకాకుండా సుప్రీం కోర్ట్ దేశం విడిచి వెళ్లకూడదని ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరించాలని అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది. ముఖ్యంగా కేసు గురించి ఎవరితోనూ చర్చించ కూడదని మరియు బహిరంగంగా ఇంటర్వ్యూలు మరియు ప్రసంగాలు ఇవ్వకూడదని కోర్టు విన్నవించింది. దీంతో చిదంబరం ఈరోజు సాయంత్రం తీహార్ జైలు నుండి విడుదల కానున్నారు. చిదంబరం కి బెయిల్ రావడంతో ప్రస్తుతం ఈ వార్త జాతీయ రాజకీయాలలో మరియు జాతీయ మీడియాలో సంచలనం అయ్యింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు చిదంబరానికి బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

కావాలని బిజెపి నాయకులు చిదంబరాన్ని ఇబ్బంది పెట్టారని కచ్చితంగా చిదంబరం కేసులో కడిగిన ముత్యంలా బయటపడటం గ్యారెంటీ అని కొంతమంది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కామెంట్ చేస్తున్నారు. కేసు విచారణలో భాగంగా ఈడి తరపున న్యాయవాదులు...చిదంబరం బయటకు వస్తే ప్రజలకు న్యాయస్థానం పై నమ్మకం పోతుందని కోర్టులో వాదించగా...నిరాదరణ ఆరోపణలతో జైల్లో పెట్టడం భావ్యం కాదని చిదంబరం తరఫున న్యాయవాదులు వారించడంతో...చివరాకరికి చిదంబరం తరపున న్యాయవాదులు వాదించిన వాదనతో కోర్టు ఏకీభవించి చిదంబరానికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: