దిశ హత్య కేసులో నిందితులకు శిక్ష ను తొందరగా అమలు చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణకు సీఎం కెసిఆర్ ఆదేశమిచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టుకు నిందితులు ఈ ఘటనకు పాల్పడినట్లు చూపే ఆధారాలను సంపాదించే పనిలో పడ్డారు పోలీసులు.

 

నిందితులు పెద్దగా చదువుకోనప్పటికీ చాలా తెలివిగా వ్యవహరించి ఘటన జరిగిన చోట సాక్షాలు ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డారు. దీనితో పోలీసులకు సాక్షాలు సేకరించడం పెద్ద సవాల్ గా మారింది. ఘటన స్థలంలో బాధితురాలి లాకెట్ తో పాటుగా దుప్పటి ముక్కలు, ప్యాంట్‌ జిప్‌, బెల్టు బకిల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వీటితో పాటుగా బాధితురాలి లోదుస్తులు, ఐడెంటిటీ కార్డు, చెప్పులు కూడా స్పందించారు. బాధితురాలిని కాల్చిన చోట గోడపై ఘటనకు సంబంధించిన పోలీసులు నిందితులకు చెందిన కీలక ఆధారాలు సంపాదించారు. బాధితురాలి పోస్టుమార్టం, డిఎన్ఏ సమాచారం కొరకు చూస్తున్నారు. ఇక కీలకమైన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు పోలీసులు. చట్టం ముందు సాక్షాలు ప్రధానము కావున ఈ కేసులు ఈ ఆధారాలు కీలకంగా మారనున్నాయి.

 

ఇక నిందితులను చర్లపల్లి జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీస్ నిఘాలో పెట్టారు. కేసులో ప్రధాన నిందితుడైన ఆరీఫ్ లో ఏమాత్రం పశ్చాత్తాపం కనపడట్లేదని పోలీసులు తెలిపారు. తను వుండే సెల్ల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులకు పిర్యాదు చేసాడు. ఆరీఫ్ కు జ్వరం తగలడంతో జైల్లోనే చికిత్స అందిస్తున్నారు. కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు కిడ్నీ సంబంధిత వ్యాధితో భాధ పడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు ఇతనికి కూడా జైల్లోనే చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.నిందితులకు కోర్టు 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఈ 14 రోజులు నిందితులను పోలీసులు విచారించనున్నారు. విచారణ తరువాత నిందితులని ఫాస్ట్రాక్ కోర్ట్ లో హాజరు పరచనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: