మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని  చెప్పుకునే చంద్రబాబునాయుడు చివరకు ఎటూకాకుండా పోయారు. ప్రతిపక్ష నేత హోదాలో ఏపిలో సరైన రాజకీయాలు చేయలేకపోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిపై అయినదానికి కానిదానికి చవకబారు ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇక నిలవ నీడకూడా లేని తెలంగాణాలో అయితే అసలు రాజకీయంగా ఉనికిలోనే లేకుండాపోయారు.

 

చంద్రబాబు ప్రస్తుత పరిస్ధితికి స్వయంకృతమే కారణమని చెప్పాలి. నలబై ఏళ్ళ రాజకీయాల్లో ఏనాడూ ఫెయిర్ పాలిటిక్స్ చేసింది లేదు. ఎవరినీ నమ్మింది లేదు. అందుకనే చంద్రబాబు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సన్నిహితుల, సలహదారుల  జాబితా మారిపోతు ఉంటుంది.

 

నలబై సంవత్సరాల రాజకీయ జీవితంలో పట్టుమని పదిమంది నమ్మకస్తులు చంద్రబాబుకు లేరంటే విచిత్రంగానే ఉంటుంది. తన అవసరార్ధం నోటికొచ్చిన హామీలిచ్చేయటం చంద్రబాబుకున్న అలవాటు. ఆచరణలోకి వచ్చేటప్పటికి చివరకు హామీలిచ్చిన నేతల్లో ఏ ఒక్కరికీ కాకుండా ఇంకెవరికో పదువులు కట్టబెట్టటం చంద్రబాబు స్టైల్. ఇటువంటి ఘటనలు కొన్ని వందలున్న కారణంగానే నేతలెవరూ చంద్రబాబును నమ్మరు.

 

ఇపుడు పార్టీలో ఉన్న నేతల్లో చాలామంది నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు ఆలోచిస్తున్నారంటే కారణం చంద్రబాబుపై విశ్వాసం లేకపోవటమే. ఇక తెలంగాణా సంగతి చూసుకుంటే పరిస్ధితి  మరీ దిగజారిపోయింది.  స్వయంగా చంద్రబాబు అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయని చెబుతున్నా పదిమంది నేతలు కూడా హాజరవ్వటం లేదు.

 

రాజకీయంగా చివరిదశలో ఉన్న చంద్రబాబుకు ఇటువంటి పరిస్ధితి ఎదురవ్వటం నిజంగా బాధాకరమే. అయితే ఈ పరిస్ధితిని ఆయనే స్వయంగా తెచ్చుకున్నారు కాబట్టి ఎవరినీ తప్పు పట్టలేం. ఇక పుత్రరత్నం విషయం చూస్తే పాపం ఎందుకూ పనికిరాకుండా పోయాడు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో ఎంఎల్సీ పదవి అయినా దక్కింది. దాని ద్వారా దొడ్డిదోవన మంత్రయిపోయారు. లేకపోతే లోకేష్ కు ఈమాత్రం కూడా గుర్తింపుండేది కాదు. చూస్తుంటే లోకేష్ భవిష్యత్తు గురించే చంద్రబాబు బాగా బెంగ పడినట్లు అర్ధమైపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: