కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అంటే ఎంత భద్రత, ఆదాయమో తెలియంది కాదు..అందులోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్ణీత వేళల్లో తప్పకుండా జరుగుతుంటాయి. అందుకే ఈ పరీక్షలో కోసం చాలా మంది ప్రిపేరవుతుంటారు. అయితే ఇప్పటి వరకూ అనేక ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేది.

 

 

ఇక త్వరలోనే ఆ బాధ తీరిపోతుంది. ఎందుకంటే.. ప్రభుత్వ రంగ సంస్థల్లో బి, సి, గ్రూపు ఉద్యోగాల ఖాళీలను ఒకే సంస్థ ఆధ్యర్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వశాఖల నుంచి దీనిపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

 

 

గ్రూపు బిలో నాన్‌ గెజిటెడ్‌, కొన్ని గెజిటెడ్‌ ఉద్యోగాలతోపాటు గ్రూపు సి పరిధిలోకి వచ్చే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇది అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడుతుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర ప్రసాద్‌ చెబుతున్నారు.

 

 

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అభ్యర్థులకు చాలా ఉపయోగాలు ఉంటాయి. నిరుద్యోగులు ప్రస్తుతం వేర్వేరు ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే బాధ తప్పుతుంది. వారి శ్రమ, డబ్బు ఖర్చు ఆదా అవుతాయి. అటు ఉద్యోగులను ఎంపిక చేసే బోర్డులకు కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. నియామకాలు సులభం అవుతాయి.

 

 

కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. సీఈటీ అమల్లోకి వస్తే.. ఈ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా నియామకాలు జరుగుతాయి. ఒకసారి పరీక్ష రాస్తే.. ఈ స్కోర్‌ ద్వారా మూడేళ్లలో ఉద్యోగం పొందవచ్చంటున్నారు. అంతే కాదు.. ఈ స్కోర్‌ను పెంచుకోవచ్చు కూడా. ఈ స్కోర్ ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేసుకోవచ్చు. ఈ పద్దతి చాలా బావుంది కదా. త్వరగా అమల్లోకి వస్తే నిరుద్యోగుల బాధలు తప్పుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: