షాద్ నగర్ శివారులో జరిగిన దిశ లైంగిక దాడి కేసు విషయంలో నిందితులకు ఉరిశిక్ష విధించాలని బయట వాదనలు వినిపిస్తున్నాయి. చాలా మంది వారికి వెంటనే ఉరిశిక్ష విధించాలి, కొందరు ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులని జైలును తరలించే క్రమంలో భారీ స్థాయిలో ఆందోళన చేశారు. అసలు ఈ రోజు ఇంతగా మనము ఆవేశం పడుతున్నాము, కానీ గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఏమి చేసామో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వారు ఎక్కడ ఏం చేస్తున్నారో మనం తెలుసుకుందాం.

 

 తెలుగు రాష్ట్రాలలో అత్యంత సంచలన కేసుగా నిలిచిన కేసు, శ్రీలక్ష్మి హత్య ఘటన 2004లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని మనోహర్ అనే నిందితుడు క్లాస్ రూమ్ లోనే హత్యచేశాడు. ఆమె తన ప్రేమకు ఒప్పుకో లేదన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. హైకోర్టు కూడా అప్పుడు మరణశిక్ష విధించింది. కానీ అతను పై కోర్టును ఆశ్రయించగా అతనికి దాన్ని శిక్షణ తగ్గిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది.

 

తాజాగా హాజీపూర్ లో నలుగురు మైనర్ బాలికలను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు నేరం మోపబడిన శ్రీనివాస్ రెడ్డిని కూడా ఇదే జరిగింది. అతను ప్రస్తుతం శ్రీనివాస్ వరంగల్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

 

 ఆ తరువాత తెలంగాణలోనే హనుమకొండ లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలిసినదే. ఈ సంవత్సరం జూన్ 19 వ తారీకు అర్ధరాత్రి హనుమకొండ లో 9 ఏళ్ల పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు ఈ కిరాతకుడు. ఈ కేసులో ప్రవీణ్ కు వరంగల్ కోర్టు కేవలం 51 రోజుల్లోనే ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ప్రకటించి సంచలనం సృష్టించింది. కానీ దీనిపై ప్రవీణ్ తరపున వ్యక్తులు హైకోర్టులో తీర్పును సవాల్ చేశారు. దీంతో హైకోర్టు కూడా అతని మరణ శిక్షను తగ్గిస్తూ జీవిత కాలం శిక్షగా మార్చింది. కాబట్టి మనము ఎంత ఆందోళనలు చేసినా కూడా కోర్టు ఈ  విషయంలో గట్టి మార్పులు తీసుకు రానంత వరకు సమాజంలో ఎటువంటి మార్పు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: