అడవిలోని కౄరమృగాలన్ని అడవిలో నివసించడం మానేసి మనుషులు అనే ముసుగేసుకుని జీవిస్తున్నట్లుగా ఉంది ఇప్పటికాలం. ఒక వైపు మహిళలపై దాడుల నేపధ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్న నాకేంటిలే అంటూ కొన్ని మగ పశువులు తమ ఉన్మాదాన్ని కొనసాగిస్తున్నాయి.

 

 

ఇక ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజు రోజుకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న, ప్రేమ అనే అగ్నికి ఆకర్షితులై తమ జీవితాల్ని అర్దాంతరంగా ముగిస్తున్న వారు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. అన్నేసి చదువులు చదువుతూ ప్రేమ అనే బలహీనతలో పడిపోయి క్షణకాలంలో పుట్టే అర్ధం లేని ఆలోచనకు లోబడి బలవంతంగా తనువులు చాలించి కన్నవారికి కన్నీటి శోకాన్ని మిగిల్చి వెళ్లుతున్నారు.

 

 

ఇలాంటి సంఘటనే ఇప్పుడు నగరంలో జరిగింది. హైదరాబాద్‌ లో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పని చేస్తున్న ఓ మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది.. వివరాలు పరిశీలిస్తే సనత్‌నగర్‌లో నివసించే పూర్ణిమ ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే దాసరి కార్తీక్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దలు అంగీకరించక పోవడంతో వారిని ఎదిరించి 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది.

 

 

ఈ క్రమంలో పూర్ణిమ బుధవారం తన ఇంట్లోనే విగత జీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే తమ కూతురిని భర్త కార్తీకే కొట్టి చంపేశాడని, కేసు నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పూర్ణిమ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

ఇకపోతే మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పూర్ణిమ మృతికి కారణమైన కార్తీక్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సనత్‌నగర్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు పూర్ణిమ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చి ఆందోళనను విరమింప చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: