ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా చిదంబరం తనకు బెయిల్ కావాలని హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ... చిదంబరానికి బేలు ఇచ్చే విషయంలో కోర్టు, మొండి చేయి చూపించింది . అయితే తాజాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాజీ మంత్రి చిదంబరం ఎట్టకేలకు బెయిల్ లభించినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసులో చిదంబరానికి బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో 105 రోజుల తర్వాత మాజీ కేంద్రమంత్రి చిదంబరం తిహార్ జైలు నుండి  బయటకు రానున్నారు. అయితే నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టులో బేలు మంజూరు విషయంపై చిదంబరం పిటిషన్ దాఖలు చేయడంతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. 

 

 

 

 కాగా ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చిదంబరం. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్  భానుమతి నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం నవంబర్ 28న తీర్పును రిజర్వ్లో పెట్టింది. కాకా నేడు  చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీంతో మాజీ మంత్రి చిదంబరానికి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది.  కాగా  నేడు సుప్రీం కోర్టులో వాదనలు జరగ్గా...  చిదంబరం ఒకవేళ బెయిల్పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు ఈడి  వాదించారు. అయితే ఈడీ  తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. చిదంబరం లాంటి వ్యక్తులు బెయిలుపై బయటకు వస్తే  వ్యవస్థ పై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుంది అంటు  తెలిపారు. 

 

 

 

 ప్రత్యేకించి అధికార దుర్వినియోగం, మని లాండరింగ్  అందరి ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఉన్న వారికి బెయిల్ ఇవ్వ కూడదని తెలిపారు. అయితే నిరాధార  ఆరోపణలతో చిదంబరాన్ని జైల్లో పెట్టాలని కోరడం సరికాదని ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్  వివరించారు. అయితే చిదంబరం బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తున్న ఈడీ  దగ్గర ఎలాంటి ఆధారాలు ఏమీ లేవంటూ తెలిపారు. కాగా  ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు చిదంబరం బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వులో పెట్టింది . కాగా నేడు ఈడి  వాదనలతో ఏకీభవించిన కోర్టు ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఎంతో కాలంగా బెయిల్ కోసం వేచి చూస్తున్న చిదంబరానికి బిగ్ రిలీజ్ వచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: