కేంద్రమాజీ మంత్రి ఫిరాయింపు రాజ్యసభ ఎంపి సుజనా చౌదరికి డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యు ట్యాక్సెస్ (డిఆర్టీ) షాకిచ్చింది. చెన్నైలోని ఐడిబిఐ బ్యాంకు నుండి తీసుకున్న రూ. 135 కోట్లను ఎగొట్టిన కేసులో  డిఆర్టి నోటీసులిచ్చింది. ఈనెల 16వ తేదీన డిఆర్టీసీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు స్పష్టంగా చెప్పారు. సుజనా చౌదరి భార్య పద్మజతో పాటు మరికొందరికి డిఆర్టీ నోటిసులు ఇవ్వటం సంచలనంగా మారింది.

 

బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న ఎగొట్టారంటూ సుజనాపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. మారిషస్ బ్యాంకులో తీసుకున్న రుణంలో రూ. 100 కోట్లను ఎగొట్టిన విషయంలో కేంద్రమంత్రిగా ఉన్నపుడే నాంపల్లి కోర్టు అరెస్టు వారెంటు ఇచ్చిన విషయం అప్పట్లో సంచలనమైంది.

 

మొత్తం మీద టిడిపిలో కీలకంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సుజనాపై అప్పట్లో సిబిఐ, ఈడి, ఐటి శాఖల ఉన్నతాధికారుల నేతృత్వంలో అనేక దాడులు జరిగాయి. ఈ కారణంగానే రాష్ట్రంలో సిబిఐ దాడులను నిరోధిస్తు చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం అప్పట్లో కలకలం రేపింది.

 

సరే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవటం, కేంద్రంలో నరేంద్రమోడి రెండోసారి ప్రధానమంత్రి అయిపోయారు. దాంతో కేసులు, అరెస్టు నుండి తనను తాను రక్షించుకోవటానికి సుజనా వెంటనే మరో ముగ్గురితో కలిసి బిజెపిలోకి ఫిరాయించారు. అయితే సుజనా బిజెపిలోకి ఫిరాయించినా ఎగొట్టిన వందల కోట్ల రూపాయల కోసం డిఆర్టి ఆయన భార్య పద్మజకు నోటీసులివ్వటం సంచలనంగా మారింది. పైగా విచారణకు హాజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 

తాజా పరిణామాలు చూస్తుంటే వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. కేసుల నుండి తప్పించుకునేందుకే సుజనా బిజెపిలోకి మారినా పెద్దగా ఉపయోగం ఉన్నట్లు లేదు. తనను తాను రక్షించుకోవటంతో పాటు చంద్రబాబును రక్షించుకోవటమే సుజనాకు పెద్ద పనిగా మారిపోయింది. ఇదే విషయమై బిజెపి నేతలు మాట్లాడుతూ తనపై నమోదైన కేసులకు సుజనానే సమాధానం చెప్పుకోవాలంటు ఎప్పటి నుండో చెబుతున్నారనుకోండి అది వేరే సంగతి. మరిపుడు సుజనా ఏం చేస్తారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: