నేడు పార్లమెంటులోని ఉభయసభల్లో శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  పార్లమెంటులో జాతీయ పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుంది  కేంద్రం. శీతాకాల సమావేశాల్లోనే జాతీయ పౌరసత్వ బిల్లు ను ఆమోదముద్ర పడేలా చేయాలని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ల గడువు  2020 జనవరి 25 తో ముగియనుంది. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో...  చట్టసభల్లో ఎస్సి ఎస్టి రిజర్వేషన్లు గడువును మరో పదేళ్లకు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం సరికొత్త బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా జాతీయ పౌరసత్వ బిల్లు కూడా కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

 

 

 

 కాగా చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపగా మరోవైపు జాతీయ పౌరసత్వ బిల్లు ను కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులను లోక్సభలో ప్రవేశ పెట్టి ఆమోద ముద్ర వేయించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే శరణార్థులకు భారత దేశ పౌరసత్వాన్ని ఇచ్చేలా ఈ బిల్లును రూపొందించింది కేంద్రం. గతంలో ఈ విషయంపై హోంమంత్రి అమిత్ షా  కూడా దేశం మొత్తం ఒకే పౌరసత్వ పట్టిక తీసుకొస్తామని తెలిపిన విషయం తెలిసింది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ చెప్పినట్లు జాతీయ పౌరసత్వ బిల్లులో కొన్ని సవరణలు చేసి ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన జాతీయ పౌరసత్వం బిల్లుపై కాంగ్రెస్ మాత్రం విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చే శరణార్థులు అయిన ముస్లిమేతరులు అంటూ పేర్కొనడంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అయితే జాతీయ పౌరసత్వ బిల్లు లో ఇంకెన్ని సవరణలు చేశారన్నది ఈ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం ఈ బిల్లు కీలకంగా మారనుంది. అయితే ఇప్పటికే ఈ బిల్లు అస్సాం రాష్ట్రంలో అమలవుతుండగా దేశ జాతీయ పౌరసత్వ పట్టికను అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగానే ముందుకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాక ఈ పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత వెల్లడి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: