ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు, ఇద్దరు జమానత్‌తో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని చిదంబరానికి ఆదేశాలు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్ష్యులతో సంప్రదింపులు జరపవద్దని కూడా చిదంబరాన్ని సుప్రీం ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో 106 రోజులుగా జైలులో ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. చిదంబరంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించలేదు. ఐఎన్ఎక్స్ మనీలాండరింగ్ సీబీఐ కేసులో ఇప్పటికే చిదంబరంకు బెయిల్ మంజూరు అయింది.

 

 

మీడియా కంపెనీ ఐఎన్ఎక్స్ పై 2017 మే15న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ కు లబ్ది చేకూర్చడానికి విదేశీ పెట్టుబడులను ఆమోదించిన ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ కంపెనీకి పెట్టుబడులు ఆమోదించిన సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన తన కుమారుడి కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నించారని దర్యాప్తును అడ్డుకోబోయారని చిదంబరం కుమారుడు కార్తీ పై ఆరోపణలు వచ్చాయి. కార్తీ డబ్బులు డిమాండ్ చేసారని ఐఎన్ఎక్స్ మాజీ డైరెక్టర్ ఇంద్రాణీ ముఖర్జీ విచారణలో చెప్పారని సీబీఐ చెప్తోంది. ఈకేసులో తన కుటుంబసభ్యుల్లో ఎవరిపైనా నేరారోపణ లేదని గతంలో చిదంబరం స్పష్టం చేశారు. ఈ కేసులో చిదంబరంపై లుక్ అవుట్ నోటీసులు కూడా గతంలో జారీ అయ్యాయి.

 

 

చిదంబరం ఆర్ధికమంత్రిగా ఉన్న సమయంలో చెస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కు ప్రమోటర్ డైరెక్టర్ గా ఉన్నారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కార్తీతో ఆర్థిక శాఖపై ఒత్తిడి తేవాలని ఆ సంస్థ భావించిందని సీబీఐ పేర్కొంది. చెస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సూచించినట్టుగా ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీ కి లేఖ రాసింది. ఎఫ్ఐపీబీ అధికారులు చూసిచూడనట్టు వదిలేశారని.. ఆర్థిక శాఖ చర్యలు తీసుకోలేదనేది అభియోగం. ఈ వివాదం నుంచి తప్పించాలని ఐఎన్ఎక్స్ సంస్థ చెస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కు డబ్బులు ఇచ్చిందని కూడా ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: