ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో ఐటీబీపీ జవాన్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జవాన్లు ఘర్షణ చోటు చేసుకోవటంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివాదం చెలరేగటంతో బెటాలియన్ లో ఉన్న రెండు వర్గాలు ఒకరినొకరు కాల్చుకున్నారని సమాచారం. ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ కు సంబంధించిన జవాన్లు ఛత్తీస్‌గఢ్ కు నక్సల్స్ కార్యకలాపాలను అదుపు చేసేందుకు వచ్చారు. 
 
నారాయణ పూర్ కు వచ్చిన జవాన్ల మధ్య తరచుగా గొడవలు గత కొంత కాలంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం జరిగిన గొడవలో జవాన్లు ఒకరిమీద ఒకరు కాల్పులు చేసుకోవటం, కొందరు జవాన్లు సహనం కోల్పోవటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన ఇద్దరు జవాన్ల పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. గాయపడినవారిని నారాయణపూర్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. 
 
ప్రతిక్షణం దేశరక్షణ కోసం పరితపిస్తూ ప్రజల కోసం ప్రాణాలర్పిస్తున్న జవాన్ల మధ్య చిన్నపాటి గొడవ జరగటంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఐటీబీపీ 45వ బెటాలియన్ కడెరన్ క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏ విషయంలో జవాన్లు గొడవపడ్డారు అనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పులు జరిగిన సమయంలో అక్కడ ఒక్కసారిగా యుద్ధవాతావరణం కనిపించిందని తెలుస్తోంది. 
 
రెండు వర్గాల మధ్య గొడవ జరగటంతో రెహమాన్ ఖాన్ అనే జవాను కాల్పులు జరపగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పులు జరగటానికి కారణమైన రెహమాన్ ఖాన్ తనకు తానుగా కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. రెహమాన్ ఖాన్ సెలవు దొరకలేదనే కారణంతో గొడవ పడుతున్న జవాన్లపై కాల్పులు జరిపాడని కొందరు చెబుతున్నారు. నారాయణ పూర్ జిల్లా ఎస్పీ మోహిత్ గార్ఘ్ ఈ ఘటనను ధ్రువీకరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: