శంషాబాద్‌ సమీపంలో అత్యాచారానికి, హత్యకు గురైన వైద్యురాలు దిశ కేసులోని ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ జ్వరంతో బాధ పడుతున్నాడు. అయితే తను ఉంటున్న చర్లపల్లి జైలు గదిలో అత్యధికంగా దోమలు ఉండటం వలన... అవి కుట్టడం వల్ల అతనికి జ్వరం వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.


అయితే... మంగళవారం రోజు చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్ ఈ నలుగురు దోషులు ఉంటున్న గదులను పరిశీలించారు. అయితే ఈ నలుగురు దోషులు... సూపరిండెంట్ సంపత్ తో మాట్లాడినట్లు సమాచారం. "సార్.. మేము ఉంటున్న గదిలో చాలా దోమలున్నాయి. బాగా ఇబ్బందులు పడుతున్నాం." అని చెప్పారు. ఆ సమయంలోనే మహ్మద్ ఆరిఫ్ అస్వస్థతతో ఉన్నట్లు తెలుసుకున్నారు ఎం. సంపత్. దీంతో ఒక డాక్టర్ ను పిలిపించి... పరీక్ష చేయించినప్పుడు... మహ్మద్ ఆరిఫ్ కు జ్వరం ఉన్నట్లు తెలిసింది. అప్పుడా డాక్టర్ కొన్ని మాత్రలను అతనికి ఇచ్చి వేసుకోమని చెప్పాడు.


ఇంకో నిందితుడు చెన్నకేశవులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఇతనికి కూడా... వైద్యులను పిలిపించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నారు. వారు ఉంటున్న రూమ్ ఎదుట... పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ వారిని బయటకు రాకుండా కాపలా కాస్తున్నారు. బాత్రూం కూడా లోపలే ఉంది. వాళ్లు తినడానికి మాత్రం టిఫిన్ లను.. భోజనంను.. తలపు క్రింది నుంచి గది లోపలికి పంపిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు.. క్రింది స్థాయి అధికారులైనా జవాన్లు.. ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరిఫ్ తో మాటలు కలిపి నిజాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే మహ్మద్ ఆరిఫ్... దిశ బ్రతికుండగానే పెట్రోల్ పోసి సజీవదహనం చేసినట్లు తెలిపాడు. అదేవిధంగా... దిశను కాళ్లు చేతులు పట్టుకొని లాక్కు పోతుంటే... తాను గట్టిగా అరుస్తూ ఉండడంతో... నిందితుడు చెన్నకేశవులు ఆమె నోట్లో మద్యం పోసినట్లు... దాంతో ఆమె స్పృహ కోల్పోయింది అని చెప్పాడు. ఆ తర్వాత పాశవికంగా దిశ మీద సామూహిక అత్యాచారం చేసినట్లు తెలిపాడు.

ఇకపోతే యావత్ భారతదేశం... నలుగురు కామాంధులను తక్షణమే ఉరితీయాలని ర్యాలీలు.. నిర్వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: