దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో విచారణను వేగంగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దిశ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం హైకోర్టుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని లేఖ రాసింది. ఈరోజు సాయంత్రం ఈ లేఖపై హైకోర్టు నుండి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
పోలీసులు దిశ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు దిశ కేసులో నిందితులను కస్టడీ కోరుతున్నారు. కస్టడీపై కూడా ఈరోజు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు నిందితులను ప్రశ్నించి 
చార్జీషీట్లను తయారు చేయనున్నారు. హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు అనుమతిస్తే నిందితులకు వేగంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా నిందితులను ఉరి తీయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 
 
ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. గతంలో వరంగల్ లో నిందితుడు ప్రవీణ్ కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఏ విధంగా ఉరిశిక్ష పడేలా చేశారో అదే విధంగా ఈ కేసులో కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయం ఈ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం దిశ ఘటనపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కేసీఆర్ ఇప్పటికే అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఒక మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ద్వారా 56 రోజుల్లో విచారణ పూర్తై తీర్పు వెలువడింది. కేసీఆర్ ఈ కేసులో కూడా సత్వర తీర్పు రావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: