బుడిబుడి అడుగులు వేసే చిన్నారుల‌కు ఆ వ‌య‌సులో అందించే ఆహారం, పాలే వారి భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుతాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇక‌, చిన్నారుల జీవితాల‌కు నేడు ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌నేది ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పెద్ద వాద‌న‌. ఇది నిజ‌మేన‌ని అంటోంది ఐక్య‌రాజ్య‌స‌మితిలోని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా. గ‌డిచిన ఐదేళ్ల రికార్డును ప‌రిశీలిస్తే.. మ‌న దేశం విష‌యానికి వ‌స్తే.. చిన్నారుల మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంది. ముఖ్యంగా తొలి మూడున్న‌రేళ్ల వ‌య‌సులోనే త‌నువు చాలిస్తున్న చిన్నారుల సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటోంద‌ని ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

 

దీనికి ప్ర‌ధానంగా పోష‌కాహార లోపం. త‌ల్లిపాల నిర్వ‌హ‌ణ‌. స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌క‌పోవ‌డ‌మేన‌ని చెబుతోంది. ప్ర‌ధానంగా 0-10 ఏళ్ల‌ చిన్నారుల‌ను కొన్ని వ‌ర్గాలుగా విభ‌జిస్తూ.. వారికి స‌రైన పోష‌ణ అందేలా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచ‌న‌లు చేసింది. చిన్నారుల విష‌యంలో త‌ల్లిదండ్రుల పాత్ర ఇద్ద‌రిదీ స‌మాన‌మే అయిన‌ప్ప‌టికీ.. త‌ల్లుల‌కే ఎక్కువ‌గా బాధ్య‌త ఉండాల‌ని సూచిస్తోంది. ఆహారం నుంచి వారి ఆరోగ్యం వ‌ర‌కు త‌ల్లులు మ‌రింత శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చాల‌ని చెబుతోంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న సూచ‌న‌లు, స‌ల‌హాలు ఏంటో  చూద్దాం.

 

+ పుట్టిన వెంట‌నే బిడ్డ‌కు త‌ల్లి పాలు ఖ‌చ్చితంగా ప‌ట్టాలి. ఇలా క‌నీసం బిడ్డకు ఐదేళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు కొన‌సాగించాలి.

 

+ త‌ల్లికి పాలు ప‌డేందుకు ఇంజ‌న్లు తీసుకుంటున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇలా చేయ‌డం బిడ్డ‌కు హానిక‌రం. దీనిస్తానంలో మెరుగైన ఫ‌లాలు, ఆహారం తీసుకోవ‌డం అత్యుత్త‌త‌మం.

 

+ స‌మ‌యానికి వైద్యుడిని సంప్ర‌దించి టీకాలు వేయించాలి. ముఖ్యంగా పోలియో త‌దిత‌ర దీర్ఘ‌కాలిక వ్యాధులు సోకకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

 

+ పండ్ల గుజ్జుతోపాటు కోడిగుడ్డులోని తెల్ల‌సొన‌ను ఉడికించి తినిపించిడం ద్వారా డీ విట‌మిన్ చేరి ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి.

 

+ ర‌క్త హీనత నేడు పిల్ల‌ల్లో త‌ర‌చుగా క‌నిపిస్తున్న వ్యాధి. దీనిని అరిక‌ట్టేందుకు క్యారెట్‌ను మించిన ఔష‌ధం లేదు. ఏదో ఒక రూపంలో క్యారెట్‌ను విరివిగా వినియోగించాలి.

 

+ పోత పాల విష‌యానికి వ‌స్తే.. గేదె పాల స్థానంలో ఆవు పాల‌కు ప్రాధాన్యం పెంచాలి.

 

+ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు కూడా అవ‌కాశం క‌ల్పించ‌డం ద్వారా కండ‌రాలు స‌త్తువ‌తో ఉంటాయ‌ని వైద్యులు సూచిస్తున్నారు.

 

+ చిన్న‌పాటి ద‌గ్గు వంటివాటికి కూడా నేడు ర‌సాయనంతో కూడిన మందుల‌ను వాడుతుండ‌డం అల‌వాటుగా మారిపోయింది. వీటి స్థానంలో క‌ర‌క్రాయ గుజ్జు లేదా మిరియాల క‌షాయం వాడాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.  

 

+ త‌ర‌చుగా జ‌బ్బు ప‌డే చిన్నారుల విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చాలి. వారికి పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని అందించ‌డం ద్వారా  వారి భ‌విష్య‌త్తుకు చిన్న‌వ‌య‌సులోనే పునాదులు వేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: